Pages

Saturday, 9 July 2011

             ముక్కుసూటిలో ముళ్ళు ఉంటాయి నా రాతలు చిరాగ్గా ఉంటాయి
రెక్కల పక్షిలా 
ఎగిరిపోవాలని ఉంది 
కాని ...
ఆకాశం కలుషితం 
అవుతుంది 
---
నీ దరిచేరాలని ఉంది
కాని...
నాలా నువ్వు మారిపోతావని ఉంది
---
నీతో ఉండాలని ఉంది
కాని ...
నాలా నువ్వు ఉండలేవని తెలిసింది
....
కసిగా కత్తిపట్టాలని ఉంది
కాని ...
నీ కలం ముందు ఓడిపోతాను


గొంతులు

నిజం నిప్పు
అబద్ధం నీరు
నిప్పుపై నీరు
ఆగిన సాక్ష్యం
పారుతున్న నీరు
జలపాతాలైన తీరు
ఆరిపోతున్న నిప్పు
మూగబోయిన గొంతులు


జీవితపోరాటం

తామరాకు మీద నీటి బిందువులా 
తొణికిసలాడుతున్న గమ్యం
మెరుస్తూ అటు ఇటు సాగుతుంటుంటే
జారిపోతున్న నీటి బిందువును 
పట్టుకోవాలని ఆరాటం 
నా జీవితపోరాటం


ప్రళయం

కుల మేఘం విలయ తాండవం చేస్తుంటే
మత మెరుపులు తలుక్కు మంటుంటే
పెద్దరికపు ఉరుములు ఉరుముతూ ఉంటె
ఆస్తి అంతస్తుల పిడుగులు పడుతుంటే
కక్షల ప్రళయం ముంచుకొస్తుంటే
పట్టింపుల ప్రకృతికి ఎదురు నిలిచి 
ప్రేమ పోరాటం సాగుతుంది
ప్రళయం ప్రణయంగా మారుతుంది

నిజమైన ప్రేమ నిలుస్తుంది.గెలుస్తుంది

కులం

కులం కులం 
కాకుల కులం 
కావాలి అందరికి ఆ కులం 
కులం తో 'మాల'కట్టవచ్చు
ఆ 'మాల' 'మాదేగా' అనవచ్చు
ఈ 'కాపు' కాయలేని 
ఈ కుల సమాజం లో 
నువ్వే 'రాజు'వి కావొచ్చు 
నువ్వే జుస్టీస్ 'చౌదరి'వి .. 
నువ్వే బండేక్కే బండ్రె డ్డివి.
కుల చక్రాల కుతంత్రాల కింద పడి
చావొచ్చు ..చంపొచ్చు ..చంపుకోవచ్చు 

సాగుతున్న పయనం

చెప్పేది అబద్ధం 
చేసేది అల్పం
దాస్తున్నది నిజం
దాగదు నా నైజం 
నీడలా వెంటాడే గతం
నివురుగప్పిన నిజం
కాలం తో గమనం 
సాగుతున్న పయనం 
ఆగిపోతుందనే భయం
ఎలా సాగుతుందీ జీవితం


ఆశ

కాల్పనిక ఆశలతో 
వాస్తవిక జీవితంతో 
నిట్టూర్పులతో 
నిజాలుతో 
ఆశ నెరవేరక 
జీవితం సాగక 
ఆశ నిరాశల 
మధ్య కొట్టుమిట్టాడుతున్నా 
ఆలోచన అంతరంగాల
మధ్య ఆగిపోయా 
కాల్పనిక సామ్రాజ్యం 
కూలిపోయింది
ఆశ కాలిపోయింది
వాస్తవం లో బతుకుతున్న
నిజాలు నమ్ముతున్న
ఇజాలు చెప్పుతున్న
నా నైజం బయటపెడుతున్న


జీవితం3

గాలిలో దీపం
జీవితం...
ఎడారిలో ఒయాసిస్సు 
ఆశలు..
ఎండమావులు -
కలలు..
వెంటాడే నీడ
అంతరాత్మ..