*******************************
ఆయన గొప్పవారు .
అలా అంటే ఆయన ఒప్పుకోరు
ఐన కాని ..చెప్పక తప్పదు
ఆయన బహు గొప్పవారు
సేవే లక్ష్యం- సేవే ఆశయం!
ఆకాశానికైన ఎక్కడో
ఒక చోట హద్దు ఉంటుంది
కాని ...ఆయన సేవలకు మాత్రం
హద్దు లేదు
మల్లె లాంటి స్వచ్చమైన మనస్సు
తోజో ఉషస్సు లాంటి వ్యక్తిత్వం
ఆయన సొంతం .
అందుకే-
ఆసాంతం సేవలోనే త్రుప్తి
పొందుతారయన . పేదల పెన్నిధిగా
కొందరికి పరమావధిగా
దాతగా ..దాతృత్వం తో
ఏదో చెయ్యాలనే తపన
అంకుటిత దీక్షా దృడసంకల్పం నాగేశ్వరరావుగారికే సొంతం .
కాదనని మనస్సు
కాదనలేని హృదయం
ఆయనకే ఒక వరం
కొన్ని సంఘటనలు
ఆయనను చలింప చేస్తాయి
ఆలోచింప చేస్తాయి
అందుకే ఆయన బహు గొప్పవారు
నాగేశ్వర రావు గారి సేవలు
మరువనివి ....మరుపురానివి
***

సేవలోనే త్రుప్తి ఆత్మ సంతృప్తి ఉందని తనకున్న దాంట్లోనే నలుగురికి సాయపడాలనే ఆలోచన ను ఆచరణలో పెట్టిన మహోన్నత వ్యక్తి
శ్రీ గెద్దాడ నాగేశ్వర రావు గారు.
వ్యక్తులు చాల మంది ఉంటారు వారిలో శక్తీ వున్నవారు కొందరే !అందుకే నాగేశ్వర రావు గారు ఒక వ్యక్తి కాదు శక్తీ.
అనుకున్నది సాధించాలనే లక్ష్యం ఆయన సొంతం.దానం లోనే ఆనందం.ఆనందం లోనే మానసిక ఆనందం పొందే వ్యక్తాయన .సొంత ఊరిపై మమకారం ,పేదలపై చెప్పలేని అభిమానం ఆయన మాటల్లోనే తేటతెల్లం ...
వృద్దులకు పేదలకు పెన్షన్లు ,అనాధలకు చేయూత .హెచ్.ఐ .వి పిల్ల్లలకు పోషకాహారం అందించడం,వికలాంగులను ఆదుకోవడం వారికి ట్రై సైకిళ్ళు పంపిణి చెయ్యడం ,చదువుకున్న బడికి పర్నిచర్ ఇవ్వడం ,పేద విద్యార్ధులకు ఉపకార వేతనం ఇవ్వడం ,ఉన్నత చదువులకు ప్రోత్సహించడం ,ఆధ్యాత్మిక సేవలో చర్చిలకు విరాళాలు ఇవ్వడం ,ఉచిత వైద్య సిభిరాలు నిర్వహించడం ..ఇలా ఎన్నో ఎన్నెన్నో అమృత హస్తాలు అందించారాయన.
చేయుతకు నిలువెత్తు సాక్ష్యం ..చేతలకు దర్పణం ..అందుకే ఆయన ఒప్పుకున్నా లేకున్నా ...ఆయన చాల గొప్పవారు. విశాల హృదయులు.. అటువంటి మా మంచి మనిషికి నా కవితాక్షరాలు అంకితమివ్వడం నా అదృష్టం
కృతజ్ఞాతాభివంధనములతో ....
మీ
ప్రతాప్
రచయిత &జర్నలిస్ట్
వర్ధమాన రచయితలవేదిక అధ్యక్షుడు

శ్రీ గెద్దాడ నాగేశ్వర రావు గారు






