Pages
Wednesday, 30 November 2011
ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భం గా
విశ్రుంఖాల సంకెళ్ళు త్రెంచుకుంటూ
శృంగార రసరమ్య అక్రమ దారుల్లో
విశ్వం పై అడుగుపెట్టింది హెచ్ ఐ వి
వానర పరిణామక్రమం లోనే
నరునకు సోకిందీ సిండ్రోమ్
రక్త మార్పిడితో రక్త చరిత్ర సృష్టిస్తుంది
అలైంగిక శృంగారంలో దాగుంది
అపరిచితుడిలా వస్తోంది
అణిగి మణిగి ఉంటుంది
హ్యూమన్ లో పవర్ తగ్గిన వెంటనే
వ్యాధి పవనాలు వీస్తుంది
కాల కూట విషం తో ప్రాణాన్నే
మింగేస్తుంధో ఎయిడ్స్ భూతం
మాయదారి భూతం
అక్రమ దారుల్లోనే
దోబూచులాడుతుంది
తొంగి తొంగి దాగుంది
వంగి వంగి చూస్తుంది .
మందుల్లేని ఎయిడ్స్ భూతం
మింగేస్తుంది సాంతం
చివరకు నువ్వు ఖతం
(వ్యభిచారం వద్దు ..సంసారమే ముద్దు ..డిసెంబర్ ఒకటి ..ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భం గా ...చెయ్యి ..చెయ్యి కలుపుదాం! !చైతన్య వంతులను చేద్దాం! ఎయిడ్స్ నివారణలో భాగస్వాములు అవుదాం !)
Sunday, 6 November 2011
Saturday, 5 November 2011
మన నాయకులండి
దొంగనా కొడుకులండి
దొరికినకాడికి
దోచేసుకుంటారండి
దొరల వేషంలో
పాలకులై
అంకినకాడికి
దోచేస్తారండి .
భారం మనపై
మోపెస్తారండి.
గ్యాసు కొట్టి
గ్యాసునే పెంచేస్తారండి
మంటలేసి
పెట్రో మంటేస్తారండి
వంగుంటే మెట్ట చేను
కోసేస్తారండి
వీలుంటే పీకలు కోసేస్తారండి
పేదోడి నడ్డి విరిచేస్తారండి
దొంగనా కొడుకులండి
సిగ్గు లజ్జ లేని పాలకులండి
మన నాయకులండి !!!
దొరికినకాడికి
దోచేసుకుంటారండి
దొరల వేషంలో
పాలకులై
అంకినకాడికి
దోచేస్తారండి .
భారం మనపై
మోపెస్తారండి.
గ్యాసు కొట్టి
గ్యాసునే పెంచేస్తారండి
మంటలేసి
పెట్రో మంటేస్తారండి
వంగుంటే మెట్ట చేను
కోసేస్తారండి
వీలుంటే పీకలు కోసేస్తారండి
పేదోడి నడ్డి విరిచేస్తారండి
దొంగనా కొడుకులండి
సిగ్గు లజ్జ లేని పాలకులండి
మన నాయకులండి !!!
Wednesday, 26 October 2011
నా ఆలోచనలు
సముద్రపు ఒడ్డున ఒంటరిగా కుర్చుని
ఆలోచిస్తుంటే సముద్ర కెరటాలను
కొత్త చూసి ఆలోచనలు వచ్చాయి
ఉవ్వెత్తున లేచే కెరటాల్లా నా ఆలోచనలు
ఎగిసిపడ్డాయి..ఎగిరిపడ్డాయి
ఈ కుళ్ళు సమాజం మీద!!
అప్పుడు నా ఆలోచనలు
కొత్త సమాజం వైపు అడుగులు వేసాయి
కాని ఈ సమాజమే ఒక సముద్రమని
కెరటాలు వెనక్కు వెళ్ళిపోతాయని
తెలిసి నా ఆలోచనలు కూడా వెనక్కి వెళ్ళిపోయాయి
ఆలోచిస్తుంటే సముద్ర కెరటాలను
కొత్త చూసి ఆలోచనలు వచ్చాయి
ఉవ్వెత్తున లేచే కెరటాల్లా నా ఆలోచనలు
ఎగిసిపడ్డాయి..ఎగిరిపడ్డాయి
ఈ కుళ్ళు సమాజం మీద!!
అప్పుడు నా ఆలోచనలు
కొత్త సమాజం వైపు అడుగులు వేసాయి
కాని ఈ సమాజమే ఒక సముద్రమని
కెరటాలు వెనక్కు వెళ్ళిపోతాయని
తెలిసి నా ఆలోచనలు కూడా వెనక్కి వెళ్ళిపోయాయి
Friday, 2 September 2011
Wednesday, 10 August 2011
కోనసీమ లో క్రాప్ హాలిడే
పచ్చని పైరులతో
అందమైన సెలయేరులతో
సరసమాడే పిల్లకాలువలుతో
వంకరల గట్టులతో
కళ కళ లాడిన కోనసీమ
నేడు విల విల బోతుంది
కల్లాల్లో ధాన్యం రైతు కళ్ళల్లో దైన్యం
అప్పుల పెట్టుబడులు
ఆకలి తీర్చని అన్నార్త నాదాలు
గిట్టుబాటులేని ధరలు
పట్టించుకోని పాలకులు
పచ్చని సీమపై పురిటి నొప్పులు
భరించలేని రైతన్న కన్నెర్ర చేసాడు
అన్నం పండించే అన్నదాత
క్రాప్ హాలిడే ప్రకటించాడు
గుండె చెదిరింది ..గూడు మిగిలింది
పంట విరామం జరిగింది
వ్యవసాయం కష్టసాయం అయ్యింది
నాడు కళ కళ లాడిన కోనసీమ
నేడు విల విల బోతుంది.

అందమైన సెలయేరులతో
సరసమాడే పిల్లకాలువలుతో
వంకరల గట్టులతో
కళ కళ లాడిన కోనసీమ
నేడు విల విల బోతుంది
కల్లాల్లో ధాన్యం రైతు కళ్ళల్లో దైన్యం
అప్పుల పెట్టుబడులు
ఆకలి తీర్చని అన్నార్త నాదాలు
గిట్టుబాటులేని ధరలు
పట్టించుకోని పాలకులు
పచ్చని సీమపై పురిటి నొప్పులు
భరించలేని రైతన్న కన్నెర్ర చేసాడు
అన్నం పండించే అన్నదాత
క్రాప్ హాలిడే ప్రకటించాడు
గుండె చెదిరింది ..గూడు మిగిలింది
పంట విరామం జరిగింది
వ్యవసాయం కష్టసాయం అయ్యింది
నాడు కళ కళ లాడిన కోనసీమ
నేడు విల విల బోతుంది.

(సేవ తెలుగు దిన పత్రికలో ఆగస్టు పదిన ప్రచురితం )
Saturday, 9 July 2011
రెక్కల పక్షిలా
ఎగిరిపోవాలని ఉంది
కాని ...
ఆకాశం కలుషితం
అవుతుంది
---
నీ దరిచేరాలని ఉంది
కాని...
నాలా నువ్వు మారిపోతావని ఉంది
---
నీతో ఉండాలని ఉంది
కాని ...
నాలా నువ్వు ఉండలేవని తెలిసింది
....
కసిగా కత్తిపట్టాలని ఉంది
కాని ...
నీ కలం ముందు ఓడిపోతాను
ఎగిరిపోవాలని ఉంది
కాని ...
ఆకాశం కలుషితం
అవుతుంది
---
నీ దరిచేరాలని ఉంది
కాని...
నాలా నువ్వు మారిపోతావని ఉంది
---
నీతో ఉండాలని ఉంది
కాని ...
నాలా నువ్వు ఉండలేవని తెలిసింది
....
కసిగా కత్తిపట్టాలని ఉంది
కాని ...
నీ కలం ముందు ఓడిపోతాను
Subscribe to:
Posts (Atom)


























