Pages

Monday, 20 February 2012


అమ్మ


నవమాసాలు మోసి పెంచి పోషించిన అమ్మ 


నీ ఆకలి కట్టుకుని నా ఆకలి తీర్చిన అమ్మ 


నీ ఒడిలో అమృతాన్ని పంచి ఇచ్చిన అమ్మ


నీ లాలనలో పాలనలో జీవితాన్ని దిద్దిన అమ్మ


నీ కష్టాలతో నన్ను ప్రయోజకుడిని చేసిన అమ్మ


నీ ఋణం ఏమిచ్చి తీర్చుకోగలను అమ్మ


నీకు ఏమిచ్చిన సాటిరాదు అమ్మ


పర్యావరణ రోదన

రోజు రోజుకి క్షీణిస్తున్న 

తన ఆరోగ్య పరిస్థితి 

చూసి  ఏడుస్తోంది ప్రకృతి 

 తలలు వాల్చి.. తనివి తీరా!

హృదయ విదారకంగా ఏడుస్తోంది .

తననే నమ్ముకున్న జనాల పరిస్థితిని 

ఊహించుకుని తట్టుకోలేక 

విషాద వదనంతో ఏడుస్తోంది.

చూసారా  ? ఈ జనాలు - 

ఓజోను కు చిల్లుపడుతుందని 

అది నాకు క్యాన్సర్లాగ వస్తుందని 

తెలిసినా మందు వెయ్యకుండా 

పట్టించుకోని జనాలను చూసి 

గట్టిగా బాధాతప్త హృదయంతో

ఏడుస్తోంది ప్రకృతి .

ప్లాస్టిక్ వద్దన్నా తనకు ఆహారంగా 

పెడుతున్నందుకు

దీనంగా ఏడుస్తోంది .

తన ఆరోగ్యాన్ని పట్టించుకొమ్మని

అందరి ఆరోగ్యాలు కాపాడుకొమ్మని

తనను కాలుష్యం కాకుండా చూడమని

ఆర్ధ్రతతో,ఆవేదనతో వేడుకుంటుంది 

ఏడుస్తూ..

(పర్యావరణాన్ని అందరం కలిసి కట్టుగా కాపాడుదాం !)