Pages
Saturday, 14 April 2012
నా కలం
నా కలం సిరా కక్కుతుంటే
జనం ఏడుస్తున్నారు
నా సిరా ఎర్రగా ఉందని
ఎర్రోడంటున్నారు
నా కలం సమాజం
వైపు మల్లుతుంటే
కుల్లుతున్నారు
సామాజిక అంశాలేనా
ఇంకేమి నీ కలంకు రావా
అంటూ గేలిచేస్తున్నారు
అభ్యుదయ భావజాలం
అంటగడుతున్నారు
భావజాలాల అంకురాన్ని
చిదిమేయ్యలని చూస్తున్నారు
నాకు ప్రేమలేదని
ప్రేమించడం రాదనీ
ప్రేమ.. నా సిరాకు రాదంటున్నారు
నా కలం జులిపిస్తే
నా కలం కదిపిస్తే
కుహాన సాహిత్యపు
మేడలు బీటలు తీస్తాయి
నా కలం కక్కితే
అర్ధనగ్న రాతలు
ఎగిరిపోతాయి
నా కలం శివతాండవం చేస్తే
అహంకారపు రాతల
రాజ్యాలన్నింటిని
కూకటివ్రేళ్ళతో పెకలిస్తా
నా సిరా తో నిత్య సత్యాలు
సృస్టిస్తా ..
నికరంగా నిర్భయంగా
నా కలాన్ని మండిస్తా
గేలి సాహిత్యాన్ని ఎండగడుతా
నా అక్షరాల పిలుపులు
మార్పునకు మలుపులు
అందుకే మీ దృష్టిలో నావి
బతుకు రాత
అంతర్జాతీయ ఖ్యాతి
గాంధీ మెచ్చిన ఖాది
నీకు మాత్రం దిక్కేది
ఆదరించే దారేది
కడుపు నింపని బతుకులు
తీరని ఆకలి వెతలు
అతుకుల బతుకులు
సరిజట్టు కూలీల మోతలు
ఆగేనా ఆత్మహత్యలు
సాగేనా వలసలు!
పట్టని నేతలు
పట్టించుకోని ప్రభుత్వాలు
ఆకలి బాధలు
వలస బతుకులు
ఓ!నేతన్న!
నిన్ను కరుణించే వారు ఏరన్న!!!
శ్రమ శక్తీ నీదన్న
లాభం దళారులదన్న
దోపిడీ రాజ్యం
దొరలాంటి దొంగల రాజ్యం
దోచుకుంటున్నారు
దాచుకుంటున్నారు
నేతలెందరు మారినా
ఓ ! నేతన్న
నీ రాత మారదు
నీ గీత మారదు
తలరాత మారదు.
బతుకు రాత మారదు
Subscribe to:
Posts (Atom)



