Pages

Saturday, 28 May 2011

బతుకు చీకటి

బాల్యం బతుకు చీకటి
కాలం కటికి చీకటి
ఎవ్వరు చేసిన పాపం?
వీళ్ళకు శాపం
ఈ జీవితం
అమ్మ నాన్న తెలీని అనాధలు
జీవిత చక్రంలో బానిసలూ
బ్రతుకు భారం
జీవితం దుర్బరం '
ఎంగిలి మెతుకుల కోసం
ఆరాటం
అర్ధాకలి తో జీవన పోరాటం
అన్నార్తనాదాలు మిన్నంటుతున్నా
వినిపించని పాడు లోకం
వీళ్ళకు శాపం
(మాకు అమ్మ ప్రేమ దక్కించారు
అంటున్న అభాగ్యులు వీళ్ళు )



మద్యం బానిస

మొదట చుక్క కొడతావు

రెండోసారి గ్లాసు కొడతావు


మూడోసారి నిబ్బు కొడతావు

నాలుగోసారి హాఫ్ కొడతావు


తర్వాత ఫుల్లు 
 కొడతావు

ఆఖరిసారి నీ జేబు కొడుతుంది


చివరిసారి నీ ప్రాణం పోతుంది

నా జీవితం


ఆకాశం ఎప్పుడు తెల్లగానే ఉంటుంది

అనుకున్నాను

కాని ఆకాశం లో మబ్బులు చూసాక

నా జీవితం గుర్తొచ్చింది.

బాల్యం తెల్లగా ఉంది

యవ్వనం మబ్బులా ఉంది...

కాని- తెలుపంటేనే నాకిష్టం.

ఆకాశం లో మబ్బులు 

పోతున్నాయి

వస్తున్నాయి

నా యవ్వనం లో మబ్బులు పోడంలేదు

మసక బారుతున్నాయి

మేఘం కమ్ముకుంటుంది 

వర్షం వర్షిస్తుంది

మరలా  ఆకాశం తెల్లగా మారిపోతుంది

నా అలవాట్లు వర్షం లో తడిచి ముద్ధవుతున్నాయి

జీవితం తడిచిపోతుంది

మేఘాలు ఆవిరవుతాయట

కాని దానివల్ల ఉపయోగం ఉంది

నా జీవితం ఆవిరవుతుంది

కన్నీటి చుక్కలా

చెడు అలవాట్లకు బానిసను నేను

మార్పు కోసం ఎదురుచూస్తున్నాను

ఆకాశం వైపు ఒంటరి చూపులు చూస్తూ

మేఘాలు గాల్లో వేల్లిపోతున్నట్టునాయి

నా చెడు స్నేహితులు కుడా ఇలా

పారిపోతే ఎంత బాగుండును

అందుకే ఆకాశం అంటే నాకెంతో ఇష్టం!


Thursday, 26 May 2011

చట్రం

కీచురాళ్ళు అరుస్తుంటే

భయపడ్డాను ఏదైనా కీడు జరుగుతుందని

కుక్కలు ఏడుస్తున్నట్టు అరుస్తుంటే

భయపడ్డాను ఎవరికైనా మరణం

ముంచుకొస్తుందని

నల్ల పిల్లి మ్యావ్ మ్యావ్ అంటూ తిరిగితే

భయపడ్డాను అరిష్టం జరగబోతుందని

గబ్బిలాలు తిరగటం చూసి

భయపడ్డాను ఏదో జరుగుతుందని

చాకలి మూటతో ఎదురువస్తే

భయపడ్డాను దరిద్రం వెంటాడుతుందని

ముదుసలి ఎదురు వస్తే

భయపడ్డాను భాగ్యం పోతుందని

కట్టెల మూతతో సైకిల్ పై సూరయ్య వస్తే

భయపడ్డాను కాడి కెల్లలిసి వస్తుందని

భయం …భయం..భయం

అణువణువునా భయంతో ..

బతుకుతున్నాను

నమ్మకాల చట్రంలో పదిలంగా

మరోపక్క భయంగా..

అన్ని అనుభవాలు తెలుసుకున్న

నమ్మకాలు మూడనమ్మకాలని

అవన్నీ స్వార్ధంతో సమాజానికి అమ్మారని

కుక్కలు అనుదైర్ఘ్య తరంగాలు వినఃగలవని

ఆశ్చర్య పోయాను

అందుకే అరుస్తాయని నివ్వెరపోయాను

గబ్బిలాలు సునామీలను కూడా ముందుగా

పసిగట్టగలవని విన్నాను

మానవుడు వినలేని శబ్దాలను

ప్రకృతి వైపరీత్యాలను కూడా అవన్నీ

ముందే పసిగట్టగలవని

తెలుసుకుని

మూడనమ్మకాల చట్రం లోనుంచి

భయటకు వచ్చా ..సిగ్గుతో తలదించుకుని .



మరణ మృదంగాలు.

జాజుల సువాసనలు

గాజుల గళగలలు

మత్తు పరిమళాలు

కాటుక కళ్ళు

కనికనిపించే అందాలు

విటులకోసం చూపులు

కన్నీటి హృదయాలు

కనిపించని దుక్ఖాలు

అవమానాలు

ఆక్రందనలు

కుళ్ళిన శరీరాలు

లాఠి దెబ్బలు

మాయని గాయాలు

మరచిపోని సంఘటనలు

మరణ మృదంగాలు.


కాల చక్రం

కాల చక్రం పరిగెడుతుంది
స్వార్ధం, ద్వేషం
కుళ్ళు, కుట్ర
అశాంతి, హింస
నేరాలు ,ఘోరాలు
అన్నింటిని పంచుకుంటూ
పెంచుకుంటూ-
శరవేగంగా పరిగెడుతుంది
గమ్యం లేని మార్గం వైపు
స్వార్ధపు దారులవైపు
కాని …
కాలంతో పాటు మనము కూడానా ?




జీవితం

సముద్రం ఎగిసిపడుతుంది

నా ఆలోచనల్లా-

కెరటాలు కొడుతోంది

నా ప్రయాణం లా-

ముందుకు వస్తుంది

నా జీవితం లా-

ఉవ్వెత్తున లేస్తుంది

నా భావలులా-

ఒడ్డుకొచ్చింది

నా గమ్యం లా-

తిరిగి వెళ్లిపోయింది

నా అదృష్టం లా -

- కత్తిమండ ప్రతాప్

Sunday, 22 May 2011

పిచ్చి రాతలు

కవితలు రాద్దామనుకున్నాను
కాని..
జీవితాలు వెక్కిరించాయి
కధలు రాద్దామనుకున్నాను
కాని..
నిజాలు నవ్వుతున్నాయి
నవల రాద్దామనుకున్నాను
కాని..
కల్పనలు కవ్వించాయి
నాటకాలు రాద్దామనుకున్నాను
కాని..
పాత్రలు వద్దన్నాయి
చివరకు ...
ఏమి రాయాలో అర్ధం కాక
పిచ్చి రాతలు రాస్తున్నాను..


విచిత్రజీవితాలు

చందమామ మీద చూపులు ఒకపక్క
భూమి లేని పేద చూపులు మరోపక్క
ఫైవ్ స్టార్ హొటల్లో బిర్యాని కోసం ఒకపక్క
చెత్తకుప్పపై మెతుకుల కోసం మరోపక్క
కొన్ని జీవితాలు అద్దాల మేడలు
కొన్ని బతుకులు గూడులేని జీవితాలు
ఎందుకీ బేధాలు అర్ధం కాని విబేధాలు
చుస్తున్నదేవుడు
శాపాలు పెట్టాడు కాబోలు
ఎసిల్లో ఒకరు
లాసుల్లో మరొకరు
చిత్రజీవితాలు
అన్నీ విచిత్రాలు
ఆకలి కేకలు
అన్నార్తనాదాలు
ఎంగిలి మెతుకులు
శాపజీవితాలు
చేసిన పాపాలు

(చేటలో పిల్లోడు తో యాచకం చేస్తున్న మహిళను చూసి స్పందిస్తూ )

(వి )చిత్రం !
కత్తిమండ ప్రతాప్
-----------------------
పిల్లి ఎదురొచ్చిందని
ప్రయాణం ఆగిపోయింది
చాకలి ఎదురొచ్చాడని
ప్రయాణం ఆగిపోయింది
విధవ ఎదురొచ్చారని
ప్రయాణం ఆగిపోయింది
ముదుసలి ఎదురొచ్చిందని
ప్రయాణం ఆగిపోయింది
కట్టెలతో మనిసోచ్చాడని
ప్రయాణం ఆగిపోయింది
కాని ..
ఏమి ఎదురు రానప్పుడు
ప్రాణం పోయింది
ఏమిటీ (వి )చిత్రం !


సమాజం కోసం….

కుళ్ళును చూడ లేక

కుట్రను చూడలేక

కుతంత్రంను చూడలేక

ద్వేషాలు చూడలేక

మోసాలు చూడలేక

పాపాలు చూడలేక

తాపాలు చూడలేక

దరిద్రాలు చూడలేక

దారుణాలు చూడలేక

కాటిన్యాలు చూడలేక

కార్పణ్యాలు చూడలేక

అన్యాయాలు చూడలేక

వింతలు చూడలేక

విచిత్రాలు చూడలేక

హింసలు చూడలేక

పాలకులను చూడలేక

నాయకులను చూడలేక

రాజకీయం చూడలేక

రచ్చ కీయం చూడలేక

నీతి కోసం

జాతి కోసం

మన కోసం

సమాజం కోసం

వినిపిస్తున్నా”ప్రతాపకీయం "

చేస్తున్నా కవితా సేవ.


కాలం తో పరిగెడదాం !

కాలం కరిగిపోతుంది
చల్లని ఐస్ ముక్కలా
జీవితం కరిగి పోతుంది
చల్లని ఐస్ క్రీములా
చల్లగా మెల్లగా
గుర్తులు మిగులుతాయి
నీటి బిందువుల్లా
నిదానంగా
ఆలోచిస్తే జీవితం ఎంత
చల్లగా ఉంటుంది
హాయిగా ఉంటుంది
కస్టాలు వచ్చినప్పుడు
నష్టాలు వచ్చినప్పుడు
మాత్రం కాలం వేడిగా ఉంటుంది
జీవితాలు మారుతాయి
రుతువులు మారినట్టుగా
కాలం మారదు సుమా
పరిగెడుతూ
తన పని తను చేసుకుంటూ
సాగిపోతుంది కాలం
ఊగిపోతుంది జీవితం


వృధా

ఈ లోకాన్ని చూసి
నా మనసులో ..
నిప్పురవ్వలు ఎగిసి పడుతున్నాయి
అగ్గి భరాటాలు మండుతున్నాయి
జ్వాలలు రగులుతున్నాయి
నరాలు తెగుతున్నాయి
ఆక్రోశంగా, ఆవేశంగా ,ఉక్రోశంగా
ఆలోచిస్తే...
ఆలోచనే వృధా అనిపిస్తుంది.


కుర్చీ హరి

నోరెత్తదు ఈ పాలన
పట్టించుకోదు ఈ పాలన
పరితపించదు ఈ పాలన
సిగ్గులేని పాలన
నెగ్గుకురాలేని పాలన
నిమ్మకు నీరెత్తని పాలన
అస్తఃవ్యస్త పాలన
శాంతి లేని పాలన
శాంతించని పాలన
ఎన్నన్న మాటలాడని పాలన
అంతే మరి
లేకుంటే కుర్చీ హరి!!!


సిగ్గు

సిగ్గు
కత్తిమండ ప్రతాప్
-------------------
అపవిత్రానికి ఆనవాళ్ళు
వేద పాటశాల దారుణాలు
సభ్యసమాజం తలధించే
లైంగిక వేదింపులు
ఊహించని పరిణామాలు
చదివేది నీతులు
మనసులో నీచాలు
దొరికితే దొంగలు
లేకుంటే దొరలు
సిగ్గు... సిగ్గు


దటీజ్ రాజకీయం!!!

ఏమివాదాలండి బాబులు
పనికి రాని వితండవాదాలు
బందుల బెదిరింపులు
బ్లాకు మెయిల్ రాజకీయాలు
చానళ్ళ గొంతు నొక్కుడులు
సాధించలేని పోరాటాలు
అలుపు సలుపు లేని ఆరాటాలు
పనికి రాని పోరాటాలు
పులిహోరాలతో నిరాహారదీక్షలు
పనికిమాలిన దీక్షలు
మీ బెదిరింపులు
తెలంగానం ఒకరు
సమైక్య నాదం మరొకరు
పబ్బం గడుపుకోడానికా
పదవులు కాపాడుకోడానికా
రెచ్చగొడుతున్నారు
రచ్చకీడుస్తున్నారు
నాయకుల జే ఏ సి లు ఏ సి ల్లొ బాగున్నాయి
విద్యార్ధుల జేయేసి లు అగ్నిగుండంలోకాలుతున్నాయి
చస్తున్నారు అమాయకులు
ప్రాణాలు వదులుతున్నారు విద్యార్ధులు
ఉద్యమాల పేరుతో బలయ్యేదేవారు
విద్యార్దులా ?
అమాయకులా ?
నాయకులా ?
చావరు నాయకులూ
చంపేస్తారు జనాలుని
ఇది నిజం
పచ్చి నిజం
దటీజ్ రాజకీయం!!!


ఆలోచన


ఆలోచన
కత్తిమండ ప్రతాప్
---------------------------------------
వెన్నెల్లో కొబ్బరి చెట్టుకింద
మంచం పై పడుకుని ఆలోచిస్తుంటే
కొబ్బరాకు సందుల్లోనుంచి
దూసుకొస్తున్న చందమామ సిగ్గులు
నాలో ఆలోచన తరంగాలను రేకెత్తించాయి
చందమామను చేరాలంటే
అందమైన మనసు కావాలని ఆలోచిస్తుంటే
చిన్న మబ్బు చందమాను కప్పింది-
నా మనసుకు మబ్బు కప్పినట్టయ్యింది
ఆకుల కదలికల్లో అందాలు
సొగసులుగా జాలువారుతున్నాయి
నీడగా మారిన ఆ క్షణం
నా మనసులో ఆలోచనలు
మసకబారాయి
కొబ్బరి ఈనే వచ్చి గుండెకు
గుచ్చికున్నట్టు అనిపించింది
నొప్పిగా ఉన్న కదలికలు
కరిగిపోతున్నాయి
మబ్బు తొలగింది
మంచాపైనే ఉన్నాను
ఆలోచిస్తూనే ...


పిలుపు

నెత్తురు చిందుకుంటూ
పిలుపు వచ్చింది అడవి నుండి
వెనుతిరిగి చూసాను
అడవి పిలుస్తూనే ఉంది
నన్నే ఎందుకు పిలుస్తుంది?
ఒక్కసారి
ముందుకు చూసాను
ఆకలి కేకలు వినిపించాయి
అప్పుల బాధలు కనిపించాయి
భూసామ్య గోల వినిపించింది
దౌర్జన్యాలు మెదిలాయి
దోపిడీలు జరిగాయి
దొంగల రాజ్యం
దొరల రాజ్యం
బతకలేని రాజ్యం కనిపించింది
అడవి వైపు అడుగులు వేసాను
పిలుపు చోటుకు చేరాను
అక్కడ కూడా పెత్తనమే
పలకరించింది
నాయకత్వ పోరు కనపడింది
రూటు లేని మ్యాపు
దర్సనమిచ్చింది
పాలసీ లేని పోరాటం వెక్కిరించింది
అడుగు వెనక్కి పడింది
బతకటం నేర్పింది
ఆశలపల్లకిలో...!




అక్షర సత్యాలు


మదిలోని భావాలు 
హృదిలోని ఊహలు
కాగితంపై అక్షర రూపాలు
మలచగ మలచగ పదాలవుతాయి
రాయగా రాయగా పాటలౌతాయి
రాస్తుండగా కవితలౌతాయి
కధలౌతాయి
కదానికలౌతాయి
జీవిత సత్యాలౌతాయి
అక్షర సత్యాలౌతాయి
ఓర్వలేని వారికి 
కుల్లుపుట్టిస్తాయ్ 
కోడిగుడ్డుకు ఈకలు లాగిస్తాయ్
పనిలేని కామెంట్లు చేయ్యిస్తాయ్ 
పట్టించుకోవద్దు
పనికిమాలిన కామెంట్లు
మదిలో మెదిలిన భావాలను
రగిలే జ్వాలల రాసేయ్ 
చందస్స వాదుల మడి వదిలించేయ్
దులిపెయ్..ధన్చెయ్
కాదేది కవితకనర్హం అని తేలిచి చెప్పెయ్


వాస్తవం


జీవితం అగమ్య గోచారం గా మారినప్పుడు
ఎండమావి కోసం పరితపిస్తావు
కాల్పనిక సామ్రాజ్యం లో బ్రతికిన నువ్వు
కలలకు అమ్ముడై పోతావు
విహారం లోనే  విహరిస్తావు
విసృన్కాలను తెంచు కుంటావు 
అనుభూతి ఆనందం నీ సొంతం 
కాని అదంతా భ్రమ అని తెలిసి 
వాస్తవ ప్రపంచం లో ...
నీ ఆశలు అడియాశలు అవుతాయి
నీ శ్వాస నిట్టుర్పు అవుతుంది 
జీవిత మజిలి కాశీ మజిలి అని తెలిసి
భ్రమ - వాస్తవం ల మధ్య 
చక్రాల చట్రం లో నలిగిపోతావు 
గెలుపు ఓటమిల చదరంగం లో 
నిన్ను నువ్వే ఓడించుకోగలవు
అందుకే భ్రమలో బ్రతకకు 
వాస్తవం లోకి అడుగు పెట్టు! 




నీటిరాతలు


సముద్రం కెరటాలు 
జీవిత ఆటుపోటులు
గోదావరి అలలు
గెలుపోటములు
ఇసుకతెన్నెలు
కష్టసుఖాలు
సముద్రపీతలు
ఆకలికేకలు
ఆల్చిప్పలు
ఆశల దీపాలు
గులకరాళ్ళు 
గుండె చప్పుళ్ళు
ఇసుకరేణువులు
కన్నీటి ధారలు
కడలి సంద్రాలు 
నీటిరాతలు
నిత్యజీవితలు 
నేటి సత్యాలు 


మనసు లోతు


గులకరాళ్ళు ఇసుకలో దొరికినప్పుడు
వాటి అద్భుత ఆకారాలు చూసి మురిసిపోయా!
అందమైన అనుభూతులు చాల
లోతుగా ఉంటాయని తెలిసి
అంతరంగాలు వెలితిగా ఉంటాయని
ఆలోచిస్తే తెలిసింది.
ఆ  లోతులో పరమార్ధం
నీ మనసులో ఉందని
ముసుగు కప్పిఉన్న  
మనసు లోతుల్లో సంతోషం ఉంటుందని
కాలంమార్పులు ఇసుక రేణువుల్ల ఎగురుతుంటే
కంట్లో పడిన ఇసుక కన్నీళ్లు రప్పిస్తుంటే
మనసు కరిగిపోతుంది ఇంద్రధనస్సులా !


Saturday, 21 May 2011

గుండె బద్దలు

గుండెలను పిండేస్తుంది ఉడుకు నెత్తురు
సల సల కాగే అగ్ని గోళం లా
పెల్లుబికె ఆవేశం లా ఆక్రోశంలా
సమాజం లోపభూయిష్టంగా
ఉండి పోతుంటే
ఉవ్వెత్తున లేచే అగ్గి రవ్వ
నిన్ను వేడెక్కిస్తుంటే
ఎవ్వరి పాపం ఇది
మనసుల సాక్షిగా
మనుషుల తోడుగా
నిర్భాగ్యుడనై
తనువు చాలించాలని 

స్వార్ధం తో
గుండెలను పిండేస్తుంది
రక్తం ముద్దగా మారుతుంది
ఐనా కాని ఏమి చెయ్యలేని
నిరాశగా...
వెర్రిచూపులు చూస్తున్న
ఈ లోకం పోకడ చూసి..


నిర్ణయం

అనుభవాల అనుభూతులతో
ఆలోచనల తుంపరలు
గెలుపోటములను వెక్కిరిస్తాయి
విజయ సాధన పరుగులెత్తిన
ఆత్మ స్థైర్యం గేలిచేసిన
ద్రుడసంకల్పం దృడంగా ఉన్న
కదిలే కాలం కాటిన్యమైన
మెదిలే ఆలోచనానతరంగాలు
నిన్ను అనుక్షణం నిద్రలేపుతాయి
మేలుకొలుపు మార్గంతో
సహవాసం స్నేహం తో
ప్రత్యక్ష పంజావిసిరే
నీ నిజాయితిని వెలకట్టనివ్వకు
నాడు ఏనాడు కుడా !
నీ నిర్ణయాన్ని మర్చుకోవద్దు
నిర్భయంగా నిష్కల్మషంగా
నీడను దరిచేరనివ్వకు
మౌనంగా .......

........

అలజడి


ఎందుకో తెలీదు !!!?
ఆలోచనలు నన్ను పిండేస్తున్నాయి
కారణం తెలీక అయోమయంలో 
కొట్టుమిట్టాడుతున్న అభాగ్యజీవిని నేను
ఈ సమాజం మీద చాల విరక్తి కలుగుతుంది
మనుసుల మీద ఉన్న జాలి పోతుంది
కర్కశంగా మారుతుంది నా మనసు
జారిపోతుంది నా గుండె 
తరుక్కుపోతుంది నా హృదయం
అలజడి, సంఘర్షణ ,ఆలోచనలు
నిరంతరం నన్ను చుట్టుముట్టుతున్నాయి 
ఎర్ర వెలుగు కనిపిస్తున్న ఒకప్పుడు 
వెలుగునిచ్చేది
ఇప్పుడంత స్వార్ధ పోరాటాలు
నాకెందుకో చాల ఆరాటం గా ఉంది
ఆశగా ఉంది ఎందుకో తెలీదు
తుపాకి పట్టుకోవాలని
కాని గమ్యం లేని ఆరాటం
లక్ష్యం లేని పోరాటం
ఎవ్వరికోసం ఈ సహవాసం 
అందుకే నాకెందుకో అయోమయం
అర్ధం కాని అలజడి .

కులమా!


కల్మషం తెలీక ఎదురీదుతున్నావా?
నిష్కల్మషంగా ఉండాలనుకుంటున్నావా?
జాతి వైరుడ్యంలో,
కుల సామ్రాజ్యంలో
నీకు  అవీ సాధ్యమేనా !?
నరనరాల్లో ఎక్కడో చిన్న ధారాగా..
అంటరానితనం ధమనులు, సిరల్లో
ప్రవహిస్తూనే ఉంటుంది.
ఎప్పుడోకప్పుడు గుండె చప్పుడు చేస్తుంది
భేదాభిప్రాయాలు భగ్గు మంటాయి 
కులనిప్పురవ్వలు చెలరేగుతాయి 
రక్తప్రసరణ జరుగుతుంది
ఈ కులజాడ్యం ఉన్నంతవరకు 
నరనరాల్లో ...
వ్యవస్థను మార్చాడానికి
ప్రయత్నించకు చాలా చాల 
మజిలీలు జరిగిపోయాయి 
వ్యవస్థలో లోపాలు వేలెత్తి చూపకు
దానికీ కులం కావాలి తెలుసా ?!!


కుళ్ళు

కుళ్ళుకు చస్తున్నారు
-------------------
అక్షరాల అల్లికలు కవితలై
గుండె గొంతుకల్లో పుట్టుకొస్తున్న
అక్షర సత్యాలైతే ..అవి
కొందరికి అజీర్ణం మైతే
కడుపుబ్బరాన్ని తట్టుకోలేక
లైక్లు పెట్టలేక ..ఓర్వలేక
కుళ్ళుకు చస్తున్నారు
కొందఱు కుహనావాదులు.
ప్రోత్సహించే పదాలు మాని
బెమ్మనత్తి పదాలు రాస్తూ
ఏదో పొడిచేసిన
అర్ధనగ్న సాహిత్యం తో
కామెంటులు చేస్తున్నారు
ఈకెలు లేని వాళ్ళుకూడా
కోడిగుడ్డుకు ఈకెలు చూస్తుంటే
వారి ఉదరంలో కుళ్ళి
వారి మనసులో కుట్ర
లోపాయికారంగా ద్వేషం
తట్టుకోలేని కుషిద్దం
పైకి మాత్రం కపట ప్రేమ
స్పష్టంగా కనిపిస్తుంది
వారి మస్తిష్కం మాత్రం
అస్పష్టం అని తెలుస్తుంది
ఏమి రచయితలండి వీళ్ళు
విర్రవీగే అక్షరాలూ రాని వాళ్ళు
''మంగళ సూత్రాలు గుండె మీద
సంనజాజులై వ్రేలాడుతుంటే ''-
అని రాస్తే సొల్లు కార్చుకుని
బాగుందని కామెంట్లు పెట్టె కవులు
ఆకలి కేకల అన్నర్తనాదాలు రాస్తే
భాలేదంటు కేకలు పెడతారు
కలం లో కూడా కులం కావాలని
అర్ధమైనప్పుడు చీల్చి చెండాడే
రక్తపు సిరా కావాలనిపిచింది
కాలం కులంతో పోతుంటే
అభిమానాలు అందాలు చూసి
అందలం ఎక్కుతుంటే
సాగదు నీచకీయం
ఈ కవితాకాలం
సాగవు ఈ వాయిస్లు
ఈ గ్రూపుల్లో కూడా కులాలు
వచ్చేసాయన్డోయ్

(కామెంట్లు తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్న కొందరు రచయితలకు అంకితం.)


జగన్నాటకం

మనిషి ఆడుతున్న జగన్నాటకం లో
దేవుడుకే శటగోపం పెడుతున్నారు
ఎందుకీ..నీచం..ఎందుకీ పైత్యం
ఈ వైపరీత్యం...
డబ్బు మాయ చూసారా?
మానవత విలువలను గాలికి
వదిలేస్తుంది
దేవుడు చేసిన మనుషులు కదా!
దేవుడినే ఆడిస్తారు
దయ్యం గా మారుతారు మార్చేస్తారు
పాపపుణ్యాలు మంట కలిసాయి
డబ్బుపుణ్యాలు కల్లుతెరిచాయి
చివరకు కల్లుపోతాయి సుమీ !!!
























రాజకీయ దెయ్యాలు


పగలు దెయ్యాలు తిరుగుతున్నాయి
రాత్రుళ్ళు కొరివి దెయ్యాలై తిరుగుతున్నాయి
నిశిరాత్రుల్లు నగ్న దెయ్యాలై తిరుగుతున్నాయి
నిజం గా నిస్తేజంగా,కర్కశం గా,కాటిన్యంగా
మనుషులరూపాల్లో తిరుగుతున్నాయి
రాజకీయ ముసుగుల్లో తిరుగుతున్నాయి
రాక్షసం గా తిరుగుతున్నాయి
సిగ్గులేకుండా తిరుగుతున్నాయి
ఆంధ్రా రాజకీయాల్లో తిరుగుతున్నాయి




వాస్తవ మజిలి



కదిలే కాలం లోమెదిలే ఆలోచనలు
వాస్తవికత వైపు పయనం చేస్తున్నాయి
కాని నా చుట్టూ కాల్పనిక సామ్రాజ్యాముంది
ఆలోచనలు ఆవిరి అవుతున్నాయి
ఊహలు చెలరేగుతున్నాయి
ఏదోచెయ్యలనే తపన ఉన్నా
ఏమిచేయ్యలేని అచేతన స్థితి
మస్తిష్కంలో మజిలీల గజిబిజి
ఆలోచనల పరంపరల తుంపరలు
నన్ను వెంటాడుతున్నాయి.
వేధిస్తున్నాయి.
అబద్ధాల చట్రం లోనుండి బయటపడాలనే
ఆశ ఉన్నా నా చుట్టూ అల్లుకున్న
కుట్రల గోడలను దాటుకుని రాలేకపోతున్న
రావాలని ఉన్నానాస్వార్ధం రానీయదు
ఇలాగే అలవాటుపడ్డా
జీవితపయనం చేతకాక
వాస్తవం లోకి రాలేక 
బతుకు చట్రం లో బలిపశువుగా మారాక !