Pages

Sunday, 22 May 2011

పిలుపు

నెత్తురు చిందుకుంటూ
పిలుపు వచ్చింది అడవి నుండి
వెనుతిరిగి చూసాను
అడవి పిలుస్తూనే ఉంది
నన్నే ఎందుకు పిలుస్తుంది?
ఒక్కసారి
ముందుకు చూసాను
ఆకలి కేకలు వినిపించాయి
అప్పుల బాధలు కనిపించాయి
భూసామ్య గోల వినిపించింది
దౌర్జన్యాలు మెదిలాయి
దోపిడీలు జరిగాయి
దొంగల రాజ్యం
దొరల రాజ్యం
బతకలేని రాజ్యం కనిపించింది
అడవి వైపు అడుగులు వేసాను
పిలుపు చోటుకు చేరాను
అక్కడ కూడా పెత్తనమే
పలకరించింది
నాయకత్వ పోరు కనపడింది
రూటు లేని మ్యాపు
దర్సనమిచ్చింది
పాలసీ లేని పోరాటం వెక్కిరించింది
అడుగు వెనక్కి పడింది
బతకటం నేర్పింది
ఆశలపల్లకిలో...!




No comments: