గుండెలను పిండేస్తుంది ఉడుకు నెత్తురు
సల సల కాగే అగ్ని గోళం లా
పెల్లుబికె ఆవేశం లా ఆక్రోశంలా
సమాజం లోపభూయిష్టంగా
ఉండి పోతుంటే
ఉవ్వెత్తున లేచే అగ్గి రవ్వ
నిన్ను వేడెక్కిస్తుంటే
ఎవ్వరి పాపం ఇది
మనసుల సాక్షిగా
మనుషుల తోడుగా
నిర్భాగ్యుడనై
తనువు చాలించాలని
స్వార్ధం తో
గుండెలను పిండేస్తుంది
రక్తం ముద్దగా మారుతుంది
ఐనా కాని ఏమి చెయ్యలేని
నిరాశగా...
వెర్రిచూపులు చూస్తున్న
ఈ లోకం పోకడ చూసి..
అనుభవాల అనుభూతులతో
ఆలోచనల తుంపరలు
గెలుపోటములను వెక్కిరిస్తాయి
విజయ సాధన పరుగులెత్తిన
ఆత్మ స్థైర్యం గేలిచేసిన
ద్రుడసంకల్పం దృడంగా ఉన్న
కదిలే కాలం కాటిన్యమైన
మెదిలే ఆలోచనానతరంగాలు
నిన్ను అనుక్షణం నిద్రలేపుతాయి
మేలుకొలుపు మార్గంతో
సహవాసం స్నేహం తో
ప్రత్యక్ష పంజావిసిరే
నీ నిజాయితిని వెలకట్టనివ్వకు
నాడు ఏనాడు కుడా !
నీ నిర్ణయాన్ని మర్చుకోవద్దు
నిర్భయంగా నిష్కల్మషంగా
నీడను దరిచేరనివ్వకు
మౌనంగా .......
........
ఎందుకో తెలీదు !!!?
ఆలోచనలు నన్ను పిండేస్తున్నాయి
కారణం తెలీక అయోమయంలో
కొట్టుమిట్టాడుతున్న అభాగ్యజీవిని నేను
ఈ సమాజం మీద చాల విరక్తి కలుగుతుంది
మనుసుల మీద ఉన్న జాలి పోతుంది
కర్కశంగా మారుతుంది నా మనసు
జారిపోతుంది నా గుండె
తరుక్కుపోతుంది నా హృదయం
అలజడి, సంఘర్షణ ,ఆలోచనలు
నిరంతరం నన్ను చుట్టుముట్టుతున్నాయి
ఎర్ర వెలుగు కనిపిస్తున్న ఒకప్పుడు
వెలుగునిచ్చేది
ఇప్పుడంత స్వార్ధ పోరాటాలు
నాకెందుకో చాల ఆరాటం గా ఉంది
ఆశగా ఉంది ఎందుకో తెలీదు
తుపాకి పట్టుకోవాలని
కాని గమ్యం లేని ఆరాటం
లక్ష్యం లేని పోరాటం
ఎవ్వరికోసం ఈ సహవాసం
అందుకే నాకెందుకో అయోమయం
అర్ధం కాని అలజడి .
కల్మషం తెలీక ఎదురీదుతున్నావా?
నిష్కల్మషంగా ఉండాలనుకుంటున్నావా?
జాతి వైరుడ్యంలో,
కుల సామ్రాజ్యంలో
నీకు అవీ సాధ్యమేనా !?
నరనరాల్లో ఎక్కడో చిన్న ధారాగా..
అంటరానితనం ధమనులు, సిరల్లో
ప్రవహిస్తూనే ఉంటుంది.
ఎప్పుడోకప్పుడు గుండె చప్పుడు చేస్తుంది
భేదాభిప్రాయాలు భగ్గు మంటాయి
కులనిప్పురవ్వలు చెలరేగుతాయి
రక్తప్రసరణ జరుగుతుంది
ఈ కులజాడ్యం ఉన్నంతవరకు
నరనరాల్లో ...
వ్యవస్థను మార్చాడానికి
ప్రయత్నించకు చాలా చాల
మజిలీలు జరిగిపోయాయి
వ్యవస్థలో లోపాలు వేలెత్తి చూపకు
దానికీ కులం కావాలి తెలుసా ?!!
కుళ్ళుకు చస్తున్నారు
-------------------
అక్షరాల అల్లికలు కవితలై
గుండె గొంతుకల్లో పుట్టుకొస్తున్న
అక్షర సత్యాలైతే ..అవి
కొందరికి అజీర్ణం మైతే
కడుపుబ్బరాన్ని తట్టుకోలేక
లైక్లు పెట్టలేక ..ఓర్వలేక
కుళ్ళుకు చస్తున్నారు
కొందఱు కుహనావాదులు.
ప్రోత్సహించే పదాలు మాని
బెమ్మనత్తి పదాలు రాస్తూ
ఏదో పొడిచేసిన
అర్ధనగ్న సాహిత్యం తో
కామెంటులు చేస్తున్నారు
ఈకెలు లేని వాళ్ళుకూడా
కోడిగుడ్డుకు ఈకెలు చూస్తుంటే
వారి ఉదరంలో కుళ్ళి
వారి మనసులో కుట్ర
లోపాయికారంగా ద్వేషం
తట్టుకోలేని కుషిద్దం
పైకి మాత్రం కపట ప్రేమ
స్పష్టంగా కనిపిస్తుంది
వారి మస్తిష్కం మాత్రం
అస్పష్టం అని తెలుస్తుంది
ఏమి రచయితలండి వీళ్ళు
విర్రవీగే అక్షరాలూ రాని వాళ్ళు
''మంగళ సూత్రాలు గుండె మీద
సంనజాజులై వ్రేలాడుతుంటే ''-
అని రాస్తే సొల్లు కార్చుకుని
బాగుందని కామెంట్లు పెట్టె కవులు
ఆకలి కేకల అన్నర్తనాదాలు రాస్తే
భాలేదంటు కేకలు పెడతారు
కలం లో కూడా కులం కావాలని
అర్ధమైనప్పుడు చీల్చి చెండాడే
రక్తపు సిరా కావాలనిపిచింది
కాలం కులంతో పోతుంటే
అభిమానాలు అందాలు చూసి
అందలం ఎక్కుతుంటే
సాగదు నీచకీయం
ఈ కవితాకాలం
సాగవు ఈ వాయిస్లు
ఈ గ్రూపుల్లో కూడా కులాలు
వచ్చేసాయన్డోయ్
(కామెంట్లు తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్న కొందరు రచయితలకు అంకితం.)

మనిషి ఆడుతున్న జగన్నాటకం లో
దేవుడుకే శటగోపం పెడుతున్నారు
ఎందుకీ..నీచం..ఎందుకీ పైత్యం
ఈ వైపరీత్యం...
డబ్బు మాయ చూసారా?
మానవత విలువలను గాలికి
వదిలేస్తుంది
దేవుడు చేసిన మనుషులు కదా!
దేవుడినే ఆడిస్తారు
దయ్యం గా మారుతారు మార్చేస్తారు
పాపపుణ్యాలు మంట కలిసాయి
డబ్బుపుణ్యాలు కల్లుతెరిచాయి
చివరకు కల్లుపోతాయి సుమీ !!!
పగలు దెయ్యాలు తిరుగుతున్నాయి
రాత్రుళ్ళు కొరివి దెయ్యాలై తిరుగుతున్నాయి
నిశిరాత్రుల్లు నగ్న దెయ్యాలై తిరుగుతున్నాయి
నిజం గా నిస్తేజంగా,కర్కశం గా,కాటిన్యంగా
మనుషులరూపాల్లో తిరుగుతున్నాయి
రాజకీయ ముసుగుల్లో తిరుగుతున్నాయి
రాక్షసం గా తిరుగుతున్నాయి
సిగ్గులేకుండా తిరుగుతున్నాయి
ఆంధ్రా రాజకీయాల్లో తిరుగుతున్నాయి
కదిలే కాలం లోమెదిలే ఆలోచనలు
వాస్తవికత వైపు పయనం చేస్తున్నాయి
కాని నా చుట్టూ కాల్పనిక సామ్రాజ్యాముంది
ఆలోచనలు ఆవిరి అవుతున్నాయి
ఊహలు చెలరేగుతున్నాయి
ఏదోచెయ్యలనే తపన ఉన్నా
ఏమిచేయ్యలేని అచేతన స్థితి
మస్తిష్కంలో మజిలీల గజిబిజి
ఆలోచనల పరంపరల తుంపరలు
నన్ను వెంటాడుతున్నాయి.
వేధిస్తున్నాయి.
అబద్ధాల చట్రం లోనుండి బయటపడాలనే
ఆశ ఉన్నా నా చుట్టూ అల్లుకున్న
కుట్రల గోడలను దాటుకుని రాలేకపోతున్న
రావాలని ఉన్నానాస్వార్ధం రానీయదు
ఇలాగే అలవాటుపడ్డా
జీవితపయనం చేతకాక
వాస్తవం లోకి రాలేక బతుకు చట్రం లో బలిపశువుగా మారాక !