Pages

Sunday, 3 March 2013

ఇప్పుడు నా పుస్తకం ఈ బుక్ గా Kinige.com లో 



http://kinige.com/kbook.php?id=1494





రక్త శాసనం!


మారని గాయం – రక్త శాసనం

రక్త శాసనం!

ముక్కలైన శరీరాలు 
తెగిపడిన దేహాలు 
అలసిన ఆహాకారాలు.. 
కన్నీళ్లను మూట గట్టి 
కన్న  పేగుల ను తెంచి 
పైశాచిక బాంబు దాడి.

ఎందుకురా! ఈ ఆటలు 
నరమేధ రక్త చరిత్రలు 
చలించదా! నీ హృదయం 
చావదా! నీ దారుణం 
ఆగదా! నీ రణం 
ఎవడికోసం .. ఎందు కోసం 
తర  తరాల రాపిడి 
నరనరాల దోపిడి 
అమాయకత్వం పైన మీ దాడి..

క్రూరులారా!  నీచులారా !!
మానవత్వం మరిచిన 
దగా  కోరులారా !
పైశాచికత్వ మూర్ఖులారా!
బరితెగించిన బడవలారా! 
బల సత్వం మీదిరా 
బలి పశువులు మేమురా! 

ఇంకాన ..

ఇకపై 
సాగవు మీ ఆటలు 
దాగవు మీ నీడలు

మారని గాయం 
ఆరని మంట 
రగిలే పౌరుషం 
ఉగ్రవాద నాశనం 
భారతీయ శాసనం 
అదే మా రక్త శాసనం.

                                      – ప్రతాప్

(బాంబు దాడి లో బలైన   అమాయకులకు నివాళి అర్పిస్తూ .. )

    
 
Pinterest
Share
- See more at: http://sevalive.com/sahithya/?p=563#sthash.Abo9OibK.dpuf

తాకట్టు జీవితాలు


తాకట్టు జీవితాలు


కూడు-గూడు -గుడ్డ లేని 
నా సంపూర్ణ పేదరికానికి 
తలసరి ఆదాయం లెక్క కట్టి 
 సాపేక్ష పేదరికం లో నన్ను చేరిస్తే 
నా ఆకలి అన్నార్త నాదాలు 
తీర్చే వారెవరు ఎవరికెరుక ?
తప్పుల తడకల ఆర్ధిక వ్యవస్థలో 
ఏసి ల్లో కూర్చుని ఇచ్చే జివో ల్లో
ఎండమావుల జీవితాలే కనిపిస్తాయి
ఆర్ధిక జీవన ప్రమాణాలు 
తెలీని నీ బొక్కల లెక్కలు 
మా రెక్కల తాకట్టు పెట్టే
 నీ ప్రపంచ బ్యాంకుకే పనికొస్తాయి. 
ఈ పనికిమాలిన ప్రవచనాలు 
దగ్గరకొస్తే నిజాలు ఇజాలవుతాయి
రూపాయికి విలువలేని ఈ దేశంలో
క్రూరమైన  విధి విధానాలకు 
కొదువలేదు
అశాస్త్రీయ ఆర్దికమే  నీకు నిజం
ఒక్కసారి మా ఆకలి చవి చూడు 
డొక్కాడని మా రెక్కలు చూడు 
చిరిగిన చితికిన జీవితాలు 
కనిపిస్తాయి .

    
 
Pinterest
Share
- See more at: http://sevalive.com/sahithya/?p=359#sthash.504tAAmp.dpuf

ఓ! బాటసారి


ఓ! బాటసారి

బీటలు తీసిన బాటలు
బ్రహ్మా జెముడు మొక్కలు
 ముళ్ళపొదలు 
పాకుతున్న పాములాగా 
సాగుతున్న రహదారి 
గమ్యం వెతుక్కుంటూ 
బాటసారి

కళ్ళల్లో ధైర్యం 
కాళ్ళల్లో అధైర్యం 
మాటల్లో ధైర్యం
చేతల్లో అధైర్యం 
ఆలోచనలు బలం 
ఆచరణ శూన్యం
వెనక్కు లాగుతున్న 
అంతరాత్మ

-కత్తిమండ ప్రతాప్

    
 
Pinterest
- See more at: http://sevalive.com/sahithya/?p=412#sthash.7PqWSesx.dpuf

- కత్తిమండ ప్రతాప్


కలంలో కాలం


కాల్పనిక వాదం 
నూతన ఒరవడి 
మాటల తక్కెడ 
పదాల తూకం 
నేటి  కవిత్వం
జీవిత సత్యాలు 
అక్షర సత్యాలు 
నిప్పులాంటి నిజాలు
పదాల పదనిసలు
నాటి కవిత్వం
భావ జాలాల అంకురం 
వికసించే పద విహారం 
కలంలో నిత్య సత్య కాలం 
మారుపురాని కవిత్వం .

 - కత్తిమండ ప్రతాప్

- See more at: http://sevalive.com/sahithya/?p=437#sthash.Rssny727.dpuf

శిధిలమైన జ్ఞాపకాలు


శిధిలమైన జ్ఞాపకాలు




శిధిలమైన జ్ఞాపకాల్లోంచి 
తొంగి చూస్తున్న గురుతులు 
మాయని మచ్చలా 
గేలి చేస్తుంటే 
శిధిలాల కింద నలిగిన
నా ఆలోచనలు 
పైకి లేవలేక 
శిధిలంగానే మిగిలిపోయాయి 
పదిలంగా దాచుకున్న 
ఆశ లు రెక్కలు తెగి 
విల విల్లాడాయి 
మధ్యకాలపు అంతర్లీన 
సమాజ పోకడలు 
నవ సమాజ స్థాపనకు 
అడ్డంకులు ఐతే 
శిధిలమైన పోకడలు 
చిరస్తాయిగానే మిగులుతాయి 
తీపి గురుతులు పంచుకుంటూ 
పుస్తకాల్లో పేజీల్లాగా …
చిరిగినా కాగితం లో అక్షరాలు 
అవహేళన చేస్తాయి..
 - కత్తిమండ ప్రతాప్
    
 
Pinterest
- See more at: http://sevalive.com/sahithya/?p=474#sthash.f2EYIFwU.dpuf