ఊరకుక్కల్లా -
హింసాత్మక వాదనలు 
తేనెటీగాల్లా 
కుట్రలు
పంది కొక్కుల్లా -
కుతంత్రాలు 
మృగంలా- 
పగ ద్వేషాలు 
పెట్రేగి పోతున్నాయి..

నేరం -ఘోరం -ఆలోచిస్తే… 
అంతా అరణ్య రోదనే
మార్పుకోసం ఆలోచిస్తే
ప్రసవ వేదనే 
చివరకు గమ్యం తెలీని ఆవేదన ..

అంతా  అగమ్యగోచరం 
చీకటి రాజ్యం లో 
చీకటి కిరణాల కోసం 
వెతుకులాట..

 - కత్తిమండ ప్రతాప్

    
 
Pinterest