మార్చురీ రాతలు
Posted by admin on March 1st, 2013 06:41 PM | కవితలు
మార్చురీ రాతలు

గబ్బిలాలు అరిచినట్లుగా నీ రాతలు
కీచురాళ్ళ శబ్దాల్లా నీ పదాలు
తీతువు పిట్ట అరుపులా కవితలు
నచ్చక మెచ్చక
ఏ సాహిత్య వనంలో ఇమడక
నీ క (కు) లం అడవి కాసిన వెన్నెల్లా
అరణ్య రోదన మిగిల్చింది
అలికిడి నత్తలా కుచించుకుపోయింది ..
ఎందుకీ రాతలు
గొప్పల చిప్పలు
ఎందుకీ బ్రహ్మస్త్రాలు ?
గాయం మానని రాతలు
మార్చురీలో శవాల ఆనవాళ్ళు
కాని ..
నీ కలల సామ్రాజ్యం లో
ఎక్కడో చిన్న మెరుపు వస్తుంది
కాలంలో ఆశ తో
కలంలో శ్వాస తో
వస్తున్నాయ్ వస్తున్నాయ్
కత్తుల్లాంటి కలాలొస్తున్నాయ్
పదండి ముందుకు
పదాల పదనిసలై పరిగెడదాం
రెండు పాళీల కలాన్ని చూపెడదాం..
– కత్తిమండ ప్రతాప్
- See more at: http://sevalive.com/sahithya/?p=614#sthash.pT3jZwgD.dpuf
No comments:
Post a Comment