రక్త శాసనం!

ముక్కలైన శరీరాలు 
తెగిపడిన దేహాలు 
అలసిన ఆహాకారాలు.. 
కన్నీళ్లను మూట గట్టి 
కన్న  పేగుల ను తెంచి 
పైశాచిక బాంబు దాడి.

ఎందుకురా! ఈ ఆటలు 
నరమేధ రక్త చరిత్రలు 
చలించదా! నీ హృదయం 
చావదా! నీ దారుణం 
ఆగదా! నీ రణం 
ఎవడికోసం .. ఎందు కోసం 
తర  తరాల రాపిడి 
నరనరాల దోపిడి 
అమాయకత్వం పైన మీ దాడి..

క్రూరులారా!  నీచులారా !!
మానవత్వం మరిచిన 
దగా  కోరులారా !
పైశాచికత్వ మూర్ఖులారా!
బరితెగించిన బడవలారా! 
బల సత్వం మీదిరా 
బలి పశువులు మేమురా! 

ఇంకాన ..

ఇకపై 
సాగవు మీ ఆటలు 
దాగవు మీ నీడలు

మారని గాయం 
ఆరని మంట 
రగిలే పౌరుషం 
ఉగ్రవాద నాశనం 
భారతీయ శాసనం 
అదే మా రక్త శాసనం.

                                      – ప్రతాప్

(బాంబు దాడి లో బలైన   అమాయకులకు నివాళి అర్పిస్తూ .. )

    
 
Pinterest
Share