నిశీధి లో ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నా
ఎక్కడైనా చిన్న వెలుగు కనిపిస్తుందని 
ఆ వెలుగు నా జీవితాన్ని 
మలుపు తిప్పుతుందని 
ఆశతో …అలాగే చూస్తున్నా
గాడాంధకార నిశీధి లో అంతా  శూన్యమే 
నా రెటీన ఎంత తిప్పినా వెలుగు లేదు సుమా!..
ఆశా వాదికి ఎప్పుడు నిరాశే సుమా!..
ముందు చూపు లేని జీవిత గమ్యం లో 
ఇప్పుడు ఈ చీకటి నాకొక భయంకరం 
ఎవ్వరికి చెప్పిన అరణ్య రోదనే 
మిణుగురు వెలుతురు  కూడా కనిపించని 
మస్తిష్కం లో కూడా  అంతా చీకటే 
బతుకే చీకటి ..నిజమే నా పాపం 
నాకు శాపం గా మారింది.
కాళరాత్రి ఇది నిజం సుమా !..

                                   – కత్తిమండ ప్రతాప్

    
 
Pinterest