kattimanda

ఆశావాది

ఆల్చిప్పలా  జీవితం మెరిసిపోతుందనుకున్నాను
ఆల్చిప్ప రెక్కల్లా జీవితం మూసుకుపోతుందనుకోలేదు.
సీతాకోకచిలుకలా  రంగురంగులతో స్వేచ్చావిహంగం
చెయ్యాలనుకున్నాను
గొంగళి పురుగులా నా స్వేచ్చకు
ముల్లుంటాయని తెలుసుకోలేకపోయాను.
తామరపువ్వులా వికసించాలనుకున్నాను
కాడలా నీళ్ళలో మునిగి ఉండాలనుకోలేదు.
నీ గురించి తెలుసుకోవాలనుకున్నాను
నీకు  నీడలా మరో జీవితం ఉందనుకోలేదు.
నాణానికి బొమ్మా-బొరుసు ఉన్నాయి
నాకు ఆశలున్నాయి నిరాశలు ఎదురవుతున్నాయి.

  – కత్తిమండ ప్రతాప్