Pages

Saturday, 25 June 2011


శాపగ్రస్త సమాజం

శాపగ్రస్త సమాజం
హిజ్రాలమని హీనం
అమ్మానాన్నలకు భారం
చీదరించే సమాజం
చీత్కరించే జనం
మేము మనసున్న
మనుషులం
బతుకు చెడ్డ విగత జీవులం
మేమేమి చేసాము పాపం
మమ్మంటూకుంటుంది నేరం


కలమనే కత్తి

నగ్న సాహిత్యం కరాళ నృత్యం  చేస్తుంటే
అర్ధనగ్న రాతలతో కామెంట్లు ఇస్తుంటే
కకావికలమైన కవిత్వం 
రెక్కలు తెగిన కోకిలలా
విల విల్లడుతుంటుంటే ...
పదాల ప్రయోగం పేరుతో
కలమనే కత్తి  చేత బట్టి 
కవిత్వాన్ని ఖూని చేసే 
విద్వంషకర రాతగాల్లు
మహా పోజుగాల్లు,
భాష ప్రయోగం పేరుతో 
వాడుకభాషను వద్దని
చందస్స భావజాలాలుతో
పెట్రేగితే
మా రాతలు మట్టి రాతలని
మట్టి కంపుకొడతాయని
చెప్పే సాహిత్యం మాది
మా రాతలు మీలా 
కల్పితాలు కావని 
జీవితాలని చెప్పే 
సాహిత్యం మాది 

బడికెల్ల(లే )ని పిల్లలు

కప్పులుకడిగే బుల్లి చేతులు
బరువులు మోసే చిట్టి మెడలు
యాచకం చేసే చిన్నారులు
బతుకీడ్చే లేత మొగ్గలు
ఎంగిలి మెతుకుల కోసం ఆరాటాలు
బతుకు పోరాటాలు
భారం మోసే బాలకార్మికులు
బడికెల్ల(లే )ని పిల్లలు
పట్టించుకోని అధికారులు
కాగితాల్లో కాకిలెక్కలు
విద్యా పక్షోత్సవాలు
అధికారుల ఆడంబరాలు
బడికి దూరమైన జీవితాలు
నగ్న సత్యాలు

మా ఆవేశం

ఎమ్మెల్యేలు ,ఎంపిల జీతాలు పెంచినట్టు
ప్రజల నిత్యావసర వస్తువులు పెంచుతారా!
జన జీవితాలతో ఆటలు ..మీకు షోకులా
ఏమి ఉద్ధరిస్తున్నారని మీకు జీతాలు
ఏమి పీకుతున్నారని మీకు హంగులు
జనాలుని దోచుకుతినడమా?
ప్రజల సొమ్మును పంచుకోవడమా
మొన్న పెట్రోలు ధర పెంచారు
నిన్న కాయగూరలు ధర పెంచారు
ఇవాళ గ్యాస్ ధర పెంచేశారు
అస్సలు ఆంధ్రాలో తీస్తున్న గ్యాస్
ఏ ముండాకొడుక్కి అమ్మేస్తున్నావు
గల్ఫ్ తరహాలో లబించే గ్యాస్ ని
ఎవడబ్బ సొమ్మని తాకట్టు పెట్టేసావు
మా నెత్తిన గుదిబండ పెడతావ?
లంచాలకు అలవాటుపడ్డ ప్రతిపక్షాలు
వెర్రివాల్లయిన ఎర్రోళ్ళు
ఎవ్వరు నోరుమెదపరు
మీ రాజ్యం ..మీ ఇస్టం
దోచుకోండి దొంగల్లరా !
ప్రస్తుతం నిద్రలో వున్నా
మా ఆవేశం ఏదో రోజున
నిద్రలేస్తుందిలే ..!!.