Pages

Saturday, 25 June 2011

కలమనే కత్తి

నగ్న సాహిత్యం కరాళ నృత్యం  చేస్తుంటే
అర్ధనగ్న రాతలతో కామెంట్లు ఇస్తుంటే
కకావికలమైన కవిత్వం 
రెక్కలు తెగిన కోకిలలా
విల విల్లడుతుంటుంటే ...
పదాల ప్రయోగం పేరుతో
కలమనే కత్తి  చేత బట్టి 
కవిత్వాన్ని ఖూని చేసే 
విద్వంషకర రాతగాల్లు
మహా పోజుగాల్లు,
భాష ప్రయోగం పేరుతో 
వాడుకభాషను వద్దని
చందస్స భావజాలాలుతో
పెట్రేగితే
మా రాతలు మట్టి రాతలని
మట్టి కంపుకొడతాయని
చెప్పే సాహిత్యం మాది
మా రాతలు మీలా 
కల్పితాలు కావని 
జీవితాలని చెప్పే 
సాహిత్యం మాది 

No comments: