Pages

Sunday, 22 May 2011

పిచ్చి రాతలు

కవితలు రాద్దామనుకున్నాను
కాని..
జీవితాలు వెక్కిరించాయి
కధలు రాద్దామనుకున్నాను
కాని..
నిజాలు నవ్వుతున్నాయి
నవల రాద్దామనుకున్నాను
కాని..
కల్పనలు కవ్వించాయి
నాటకాలు రాద్దామనుకున్నాను
కాని..
పాత్రలు వద్దన్నాయి
చివరకు ...
ఏమి రాయాలో అర్ధం కాక
పిచ్చి రాతలు రాస్తున్నాను..


విచిత్రజీవితాలు

చందమామ మీద చూపులు ఒకపక్క
భూమి లేని పేద చూపులు మరోపక్క
ఫైవ్ స్టార్ హొటల్లో బిర్యాని కోసం ఒకపక్క
చెత్తకుప్పపై మెతుకుల కోసం మరోపక్క
కొన్ని జీవితాలు అద్దాల మేడలు
కొన్ని బతుకులు గూడులేని జీవితాలు
ఎందుకీ బేధాలు అర్ధం కాని విబేధాలు
చుస్తున్నదేవుడు
శాపాలు పెట్టాడు కాబోలు
ఎసిల్లో ఒకరు
లాసుల్లో మరొకరు
చిత్రజీవితాలు
అన్నీ విచిత్రాలు
ఆకలి కేకలు
అన్నార్తనాదాలు
ఎంగిలి మెతుకులు
శాపజీవితాలు
చేసిన పాపాలు

(చేటలో పిల్లోడు తో యాచకం చేస్తున్న మహిళను చూసి స్పందిస్తూ )

(వి )చిత్రం !
కత్తిమండ ప్రతాప్
-----------------------
పిల్లి ఎదురొచ్చిందని
ప్రయాణం ఆగిపోయింది
చాకలి ఎదురొచ్చాడని
ప్రయాణం ఆగిపోయింది
విధవ ఎదురొచ్చారని
ప్రయాణం ఆగిపోయింది
ముదుసలి ఎదురొచ్చిందని
ప్రయాణం ఆగిపోయింది
కట్టెలతో మనిసోచ్చాడని
ప్రయాణం ఆగిపోయింది
కాని ..
ఏమి ఎదురు రానప్పుడు
ప్రాణం పోయింది
ఏమిటీ (వి )చిత్రం !


సమాజం కోసం….

కుళ్ళును చూడ లేక

కుట్రను చూడలేక

కుతంత్రంను చూడలేక

ద్వేషాలు చూడలేక

మోసాలు చూడలేక

పాపాలు చూడలేక

తాపాలు చూడలేక

దరిద్రాలు చూడలేక

దారుణాలు చూడలేక

కాటిన్యాలు చూడలేక

కార్పణ్యాలు చూడలేక

అన్యాయాలు చూడలేక

వింతలు చూడలేక

విచిత్రాలు చూడలేక

హింసలు చూడలేక

పాలకులను చూడలేక

నాయకులను చూడలేక

రాజకీయం చూడలేక

రచ్చ కీయం చూడలేక

నీతి కోసం

జాతి కోసం

మన కోసం

సమాజం కోసం

వినిపిస్తున్నా”ప్రతాపకీయం "

చేస్తున్నా కవితా సేవ.


కాలం తో పరిగెడదాం !

కాలం కరిగిపోతుంది
చల్లని ఐస్ ముక్కలా
జీవితం కరిగి పోతుంది
చల్లని ఐస్ క్రీములా
చల్లగా మెల్లగా
గుర్తులు మిగులుతాయి
నీటి బిందువుల్లా
నిదానంగా
ఆలోచిస్తే జీవితం ఎంత
చల్లగా ఉంటుంది
హాయిగా ఉంటుంది
కస్టాలు వచ్చినప్పుడు
నష్టాలు వచ్చినప్పుడు
మాత్రం కాలం వేడిగా ఉంటుంది
జీవితాలు మారుతాయి
రుతువులు మారినట్టుగా
కాలం మారదు సుమా
పరిగెడుతూ
తన పని తను చేసుకుంటూ
సాగిపోతుంది కాలం
ఊగిపోతుంది జీవితం


వృధా

ఈ లోకాన్ని చూసి
నా మనసులో ..
నిప్పురవ్వలు ఎగిసి పడుతున్నాయి
అగ్గి భరాటాలు మండుతున్నాయి
జ్వాలలు రగులుతున్నాయి
నరాలు తెగుతున్నాయి
ఆక్రోశంగా, ఆవేశంగా ,ఉక్రోశంగా
ఆలోచిస్తే...
ఆలోచనే వృధా అనిపిస్తుంది.


కుర్చీ హరి

నోరెత్తదు ఈ పాలన
పట్టించుకోదు ఈ పాలన
పరితపించదు ఈ పాలన
సిగ్గులేని పాలన
నెగ్గుకురాలేని పాలన
నిమ్మకు నీరెత్తని పాలన
అస్తఃవ్యస్త పాలన
శాంతి లేని పాలన
శాంతించని పాలన
ఎన్నన్న మాటలాడని పాలన
అంతే మరి
లేకుంటే కుర్చీ హరి!!!


సిగ్గు

సిగ్గు
కత్తిమండ ప్రతాప్
-------------------
అపవిత్రానికి ఆనవాళ్ళు
వేద పాటశాల దారుణాలు
సభ్యసమాజం తలధించే
లైంగిక వేదింపులు
ఊహించని పరిణామాలు
చదివేది నీతులు
మనసులో నీచాలు
దొరికితే దొంగలు
లేకుంటే దొరలు
సిగ్గు... సిగ్గు


దటీజ్ రాజకీయం!!!

ఏమివాదాలండి బాబులు
పనికి రాని వితండవాదాలు
బందుల బెదిరింపులు
బ్లాకు మెయిల్ రాజకీయాలు
చానళ్ళ గొంతు నొక్కుడులు
సాధించలేని పోరాటాలు
అలుపు సలుపు లేని ఆరాటాలు
పనికి రాని పోరాటాలు
పులిహోరాలతో నిరాహారదీక్షలు
పనికిమాలిన దీక్షలు
మీ బెదిరింపులు
తెలంగానం ఒకరు
సమైక్య నాదం మరొకరు
పబ్బం గడుపుకోడానికా
పదవులు కాపాడుకోడానికా
రెచ్చగొడుతున్నారు
రచ్చకీడుస్తున్నారు
నాయకుల జే ఏ సి లు ఏ సి ల్లొ బాగున్నాయి
విద్యార్ధుల జేయేసి లు అగ్నిగుండంలోకాలుతున్నాయి
చస్తున్నారు అమాయకులు
ప్రాణాలు వదులుతున్నారు విద్యార్ధులు
ఉద్యమాల పేరుతో బలయ్యేదేవారు
విద్యార్దులా ?
అమాయకులా ?
నాయకులా ?
చావరు నాయకులూ
చంపేస్తారు జనాలుని
ఇది నిజం
పచ్చి నిజం
దటీజ్ రాజకీయం!!!


ఆలోచన


ఆలోచన
కత్తిమండ ప్రతాప్
---------------------------------------
వెన్నెల్లో కొబ్బరి చెట్టుకింద
మంచం పై పడుకుని ఆలోచిస్తుంటే
కొబ్బరాకు సందుల్లోనుంచి
దూసుకొస్తున్న చందమామ సిగ్గులు
నాలో ఆలోచన తరంగాలను రేకెత్తించాయి
చందమామను చేరాలంటే
అందమైన మనసు కావాలని ఆలోచిస్తుంటే
చిన్న మబ్బు చందమాను కప్పింది-
నా మనసుకు మబ్బు కప్పినట్టయ్యింది
ఆకుల కదలికల్లో అందాలు
సొగసులుగా జాలువారుతున్నాయి
నీడగా మారిన ఆ క్షణం
నా మనసులో ఆలోచనలు
మసకబారాయి
కొబ్బరి ఈనే వచ్చి గుండెకు
గుచ్చికున్నట్టు అనిపించింది
నొప్పిగా ఉన్న కదలికలు
కరిగిపోతున్నాయి
మబ్బు తొలగింది
మంచాపైనే ఉన్నాను
ఆలోచిస్తూనే ...


పిలుపు

నెత్తురు చిందుకుంటూ
పిలుపు వచ్చింది అడవి నుండి
వెనుతిరిగి చూసాను
అడవి పిలుస్తూనే ఉంది
నన్నే ఎందుకు పిలుస్తుంది?
ఒక్కసారి
ముందుకు చూసాను
ఆకలి కేకలు వినిపించాయి
అప్పుల బాధలు కనిపించాయి
భూసామ్య గోల వినిపించింది
దౌర్జన్యాలు మెదిలాయి
దోపిడీలు జరిగాయి
దొంగల రాజ్యం
దొరల రాజ్యం
బతకలేని రాజ్యం కనిపించింది
అడవి వైపు అడుగులు వేసాను
పిలుపు చోటుకు చేరాను
అక్కడ కూడా పెత్తనమే
పలకరించింది
నాయకత్వ పోరు కనపడింది
రూటు లేని మ్యాపు
దర్సనమిచ్చింది
పాలసీ లేని పోరాటం వెక్కిరించింది
అడుగు వెనక్కి పడింది
బతకటం నేర్పింది
ఆశలపల్లకిలో...!




అక్షర సత్యాలు


మదిలోని భావాలు 
హృదిలోని ఊహలు
కాగితంపై అక్షర రూపాలు
మలచగ మలచగ పదాలవుతాయి
రాయగా రాయగా పాటలౌతాయి
రాస్తుండగా కవితలౌతాయి
కధలౌతాయి
కదానికలౌతాయి
జీవిత సత్యాలౌతాయి
అక్షర సత్యాలౌతాయి
ఓర్వలేని వారికి 
కుల్లుపుట్టిస్తాయ్ 
కోడిగుడ్డుకు ఈకలు లాగిస్తాయ్
పనిలేని కామెంట్లు చేయ్యిస్తాయ్ 
పట్టించుకోవద్దు
పనికిమాలిన కామెంట్లు
మదిలో మెదిలిన భావాలను
రగిలే జ్వాలల రాసేయ్ 
చందస్స వాదుల మడి వదిలించేయ్
దులిపెయ్..ధన్చెయ్
కాదేది కవితకనర్హం అని తేలిచి చెప్పెయ్


వాస్తవం


జీవితం అగమ్య గోచారం గా మారినప్పుడు
ఎండమావి కోసం పరితపిస్తావు
కాల్పనిక సామ్రాజ్యం లో బ్రతికిన నువ్వు
కలలకు అమ్ముడై పోతావు
విహారం లోనే  విహరిస్తావు
విసృన్కాలను తెంచు కుంటావు 
అనుభూతి ఆనందం నీ సొంతం 
కాని అదంతా భ్రమ అని తెలిసి 
వాస్తవ ప్రపంచం లో ...
నీ ఆశలు అడియాశలు అవుతాయి
నీ శ్వాస నిట్టుర్పు అవుతుంది 
జీవిత మజిలి కాశీ మజిలి అని తెలిసి
భ్రమ - వాస్తవం ల మధ్య 
చక్రాల చట్రం లో నలిగిపోతావు 
గెలుపు ఓటమిల చదరంగం లో 
నిన్ను నువ్వే ఓడించుకోగలవు
అందుకే భ్రమలో బ్రతకకు 
వాస్తవం లోకి అడుగు పెట్టు! 




నీటిరాతలు


సముద్రం కెరటాలు 
జీవిత ఆటుపోటులు
గోదావరి అలలు
గెలుపోటములు
ఇసుకతెన్నెలు
కష్టసుఖాలు
సముద్రపీతలు
ఆకలికేకలు
ఆల్చిప్పలు
ఆశల దీపాలు
గులకరాళ్ళు 
గుండె చప్పుళ్ళు
ఇసుకరేణువులు
కన్నీటి ధారలు
కడలి సంద్రాలు 
నీటిరాతలు
నిత్యజీవితలు 
నేటి సత్యాలు 


మనసు లోతు


గులకరాళ్ళు ఇసుకలో దొరికినప్పుడు
వాటి అద్భుత ఆకారాలు చూసి మురిసిపోయా!
అందమైన అనుభూతులు చాల
లోతుగా ఉంటాయని తెలిసి
అంతరంగాలు వెలితిగా ఉంటాయని
ఆలోచిస్తే తెలిసింది.
ఆ  లోతులో పరమార్ధం
నీ మనసులో ఉందని
ముసుగు కప్పిఉన్న  
మనసు లోతుల్లో సంతోషం ఉంటుందని
కాలంమార్పులు ఇసుక రేణువుల్ల ఎగురుతుంటే
కంట్లో పడిన ఇసుక కన్నీళ్లు రప్పిస్తుంటే
మనసు కరిగిపోతుంది ఇంద్రధనస్సులా !