Pages

Sunday, 22 May 2011

ఆలోచన


ఆలోచన
కత్తిమండ ప్రతాప్
---------------------------------------
వెన్నెల్లో కొబ్బరి చెట్టుకింద
మంచం పై పడుకుని ఆలోచిస్తుంటే
కొబ్బరాకు సందుల్లోనుంచి
దూసుకొస్తున్న చందమామ సిగ్గులు
నాలో ఆలోచన తరంగాలను రేకెత్తించాయి
చందమామను చేరాలంటే
అందమైన మనసు కావాలని ఆలోచిస్తుంటే
చిన్న మబ్బు చందమాను కప్పింది-
నా మనసుకు మబ్బు కప్పినట్టయ్యింది
ఆకుల కదలికల్లో అందాలు
సొగసులుగా జాలువారుతున్నాయి
నీడగా మారిన ఆ క్షణం
నా మనసులో ఆలోచనలు
మసకబారాయి
కొబ్బరి ఈనే వచ్చి గుండెకు
గుచ్చికున్నట్టు అనిపించింది
నొప్పిగా ఉన్న కదలికలు
కరిగిపోతున్నాయి
మబ్బు తొలగింది
మంచాపైనే ఉన్నాను
ఆలోచిస్తూనే ...


No comments: