Pages

Friday, 20 January 2012

నా అక్షరాలు


ఆకలి కోసం


నీ లో ఆనందం 
నా లో ఆకలి 
శారీరక సుఖం  కోసం నువ్వు
పొట్ట కూటి కోసం  నేను 
*******
బ్రతుకు బక్క చిక్కి నేను
బలిసిన మదం తో  నువ్వు
*******
నేను తాకట్టు పెట్టేది నా శరీరాన్ని
నువ్వు అందుకునేది   సుఖాన్ని
 *******
జీవితం లో ఓటమి నాది
శరీరం లో గెలుపు నీది


నేటి జీవితం

కల్పించటం చాల తేలిక
. 
నటించటం మరీ తేలిక 


 జీవించడం..ఇంకా తేలిక


కల్పనలు..నటనలు కలిస్తేనే 


నేటి జీవితం




తలరాత

బతుకు పోరాటం

మెతుకు కోసం ఆరాటం 


కన్నీటి జీవితం


వేషాల జీవనం 


నేతలు మారిన 


తలరాత మారదు


జాతి పిత 


ఏంటీ కథా.!!!.




అద్దం -భూ-తద్దం

అద్దంలో చూసుకున్నాను 

నన్ను నేను మరిచాను

 
భూతద్దం 
లో చూసుకున్నాను

నన్ను నేనే అసహ్యించుకున్నాను

 
ఒకటి ఆశ- రెండోది నిరాశ


వెరశి నా జీవితం ఒక 
పగిలిన అద్దం