Pages

Sunday, 27 May 2012

ఆత్మస్థైర్యం




మనిషికే అవిటితనం


మనసుకు కాదు


ఆత్మస్థైర్యం ముందు


అంగవైకల్యం ఓడిపోతుంది


ధైర్యం తలెత్తుతుంది


అనుకున్నది సాధిస్తుంది


అవమానం వీగిపోతుంది


జీవితం గెలుస్తుంది

Wednesday, 16 May 2012


Tuesday, 1 May 2012

చీకటి బతుకు


(సేవ పత్రికలో ప్రచురితం )
నిశీధి లో ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నా
ఎక్కడైనా చిన్న వెలుగు కనిపిస్తుందని 
ఆ వెలుగు నా జీవితాన్ని 
మలుపు తిప్పుతుందని 
ఆశతో ...అలాగే చూస్తున్నా
గాడాంధకార నిశీధి లో అంతా  శూన్యమే 
నా రెటీన ఎంత తిప్పినా వెలుగు లేదు సుమా1
ఆశా వాదికి ఎప్పుడు నిరాశే సుమా
ముందు చూపు లేని జీవిత గమ్యం లో 
ఇప్పుడు ఈ చీకటి నాకొక భయంకరం 
ఎవ్వరికి చెప్పిన అరణ్య రోదనే 
మిణుగురు వెలుతురు  కూడా కనిపించని 
మస్తిష్కం లో కూడా  అంతా చీకటే 
బతుకే చీకటి ..నిజమే నా పాపం 
నాకు శాపం గా మారింది.
కాళరాత్రి ఇది నిజం సుమా 

మట్టి వాసన



ఎన్నాళ్ళు ఈ దోపిడీ తనం
ఎన్నేళ్ళు  ఈ దొరల పెత్తనం
కోట్లు వాళ్ళవి ..
ఫీట్లు మనవి
మట్టి పని మనదిరా
గట్టి చేతులు మనవిరా
వట్టి చేతలు వాళ్ళవిరా !
ఎన్నాళ్ళు?! - ఇంకెన్నాళ్ళు?!
రక్తం తో తడిసిన
ఎర్రజెండా స్ర్ముతులు
ప్రకంపనాలై
మేడే సాక్షిగా పిలుస్తున్నాయి
చిరిగిన జీవితం మాదిరా
చితికిన   బతుకు మాదిరా
చికాగో పోరాటం మాదేరా
కలసి రండి
కదలి రండి
బూర్జవా వ్యవస్థను
కూకటి వ్రేళ్ళతో కూల్చేద్దాం !
కాల్చేద్దాం ..
శ్రమ శక్తిని నిరూపిద్దాం
మట్టి వాసన చూపిద్దాం
కార్మికలోకం
కర్షక లోకం
ఏకం కండి
కార్మికులారా ఏకం కండి
వర్దిల్లే ఐక్యత
చాటి చెబుదాం !!!


ఎడారి స్వప్నం

మదిలో నదీ ప్రవాహం 
ఒడ్డుకు చేరే గమ్యం 
తెర చాపలా జీవితం 
బ్రతుకు పోరాటం 
============
ఎడారి స్వప్నం 
కల చెదిరిన మనసు
ఊహా సౌందర్యం
ఆశల పల్లకి
మోసే వాళ్ళే శూన్యం


నీ అక్షరాలే మా ఊపిరి!


( శ్రీ శ్రీ జయంతి సందర్భంగా వ్రాసిన కవిత  )
శ్రమజీవుల మట్టి మాటలను 
మూట గట్టిన ఎర్ర కవిత్వం నీది 
కుహానా సాహిత్యాన్ని కుదిపేసింది 
చాందస్స వాదుల కుల కలం
ఇం (కు) కిపోయింది
మీ మహా ప్రస్థానం 
సాహిత్యలోకం లో 
కవితా ప్రస్తానమై -
మరో ప్రపంచం గా 
నిలిచింది.
రాబందుల రెక్కల చప్పుళ్ళు 
ఆగిపోయాయి
నోరేల్లబెట్టిన గొంతులన్ని
మూగబోయాయి
అందుకే మీది
మరో ప్రస్థానం!
ఏడ్చే వారి కలాలు
జగన్నాధ రధ చక్రాల 
క్రిందపడి నలిగిపోయాయి 
మెదడ్లు కుళ్ళిన ,
కాలం చెల్లిన రాతలకు 
రాతగాల్ల్లకు 
కోత రాయుల్లకు 
ధ్వంసరచన చేసే 
ధ్వంసనచణ
హింస రచన చేసే 
సోమరిపోతుల్లకు 
నెత్తురు మండే,
శక్తులు నిండే,
మరో ప్రపంచం చూపించావు
పదండి ముందుకు 
ఎగిరి, ఎగిరి, ఎగిరి పడుతున్నవి
కొత్త గొంతుకలు
నీ భావ జాల అడుగులు 
తిరిగి, తిరిగి, తిరిగి కవితలై 
జలప్రళయ నాట్యం చేస్తున్నవి!
ప్రజా కవిగా ...
అక్రమాలను కాలరాసిన కలం నీది
ఉక్కు పదం నీది 
లక్ష్లాది ప్రజల ఆశా జ్యోతివై నిలిచావు
అందుకే 
నీవు వినిపించే నవీన గీతికి,
నీ విరచించే నవీన రీతికి,
భావ్యం!
భాగ్యం!
ప్రాణం!
ప్రణవం.
మహా ప్రస్తానం 
మరో ప్రస్తానం 
నీ అక్షరాలే మా ఊపిరి!
నీ పదాలే మా అక్షరాయుధాలు !!! 




నీటిలో 
కాగితం పడవ
చిరిగిన తెరచాప 
మునిగిన జీవితం
అంతర్మధనం 
==========
పచ్చని కొబ్బరాకు తో 
అల్లిన తడికె లా 
అటు ఇటు ముడుల
అమరికలా  
నా జీవితం 

చిరిగిన జీవితం


పగిలిన గాజులు 
నలిగినా సన్నజాజులు
చిరిగిన జీవితం 
ఒకరిది మోసం .
.ఇంకొకరిది వేషం 
కుక్కలు చింపిన విస్తరి  
లేదా నీకు ఇంకో దారి ?



వెలుగు నీడ


నల్లటి కారుమబ్బులలో 
కాంతిపుంజం మిరుమిట్లు 
గొలుపుతుంటే 
వర్షపు చినుకుల 
తలపుల కోసం 
ఎదురు చూస్తున్నా
క్షణం లో ....
ప్రకృతి మార్పులతో 
కారుమబ్బులు కరిగి పోతుంటే 
ఋతువుల చక్రం 
కాల చక్రం లా మారుతుంటే
బ్రతుకు పోరాటం 
వెలుగు నీడలా మారుతుంది
ఆలోచనలు మాత్రం 
ఆకాశం వైపు చూస్తున్నాయి

నిజం


నిజం చెప్పాలని ఉంది
అబద్ధం అడ్డుకట్ట వేస్తుంది
నిస్వార్ధం గా ఉండాలనుకున్నా
స్వార్ధం చుట్టూచేరి ఉంది
అందుకే ఈ సమాజపు
సంకెళ్ళు త్రెంచుకు
రావాలని ఉంది .


అంతర్మధనం

ఎప్పుడైనా నీ మస్తిష్క అంతరంగం లోకి 
తొంగిచుసావా?
భూప్రకంపనంలు.సునామీలు,లావాలు 
ఒకదానికొకటి దోబూచులాడుకుంటూ ఉంటాయి 
ఎపుడు పైకి వద్దామా అని 
తరంగాల అంతరంగంలా 
లోన అలజడి ..పైకి ప్రశాంతత.
అదే అంతర్మధన జీవితం