Pages

Tuesday, 1 May 2012

నీ అక్షరాలే మా ఊపిరి!


( శ్రీ శ్రీ జయంతి సందర్భంగా వ్రాసిన కవిత  )
శ్రమజీవుల మట్టి మాటలను 
మూట గట్టిన ఎర్ర కవిత్వం నీది 
కుహానా సాహిత్యాన్ని కుదిపేసింది 
చాందస్స వాదుల కుల కలం
ఇం (కు) కిపోయింది
మీ మహా ప్రస్థానం 
సాహిత్యలోకం లో 
కవితా ప్రస్తానమై -
మరో ప్రపంచం గా 
నిలిచింది.
రాబందుల రెక్కల చప్పుళ్ళు 
ఆగిపోయాయి
నోరేల్లబెట్టిన గొంతులన్ని
మూగబోయాయి
అందుకే మీది
మరో ప్రస్థానం!
ఏడ్చే వారి కలాలు
జగన్నాధ రధ చక్రాల 
క్రిందపడి నలిగిపోయాయి 
మెదడ్లు కుళ్ళిన ,
కాలం చెల్లిన రాతలకు 
రాతగాల్ల్లకు 
కోత రాయుల్లకు 
ధ్వంసరచన చేసే 
ధ్వంసనచణ
హింస రచన చేసే 
సోమరిపోతుల్లకు 
నెత్తురు మండే,
శక్తులు నిండే,
మరో ప్రపంచం చూపించావు
పదండి ముందుకు 
ఎగిరి, ఎగిరి, ఎగిరి పడుతున్నవి
కొత్త గొంతుకలు
నీ భావ జాల అడుగులు 
తిరిగి, తిరిగి, తిరిగి కవితలై 
జలప్రళయ నాట్యం చేస్తున్నవి!
ప్రజా కవిగా ...
అక్రమాలను కాలరాసిన కలం నీది
ఉక్కు పదం నీది 
లక్ష్లాది ప్రజల ఆశా జ్యోతివై నిలిచావు
అందుకే 
నీవు వినిపించే నవీన గీతికి,
నీ విరచించే నవీన రీతికి,
భావ్యం!
భాగ్యం!
ప్రాణం!
ప్రణవం.
మహా ప్రస్తానం 
మరో ప్రస్తానం 
నీ అక్షరాలే మా ఊపిరి!
నీ పదాలే మా అక్షరాయుధాలు !!! 



No comments: