Pages

Saturday, 25 June 2011


శాపగ్రస్త సమాజం

శాపగ్రస్త సమాజం
హిజ్రాలమని హీనం
అమ్మానాన్నలకు భారం
చీదరించే సమాజం
చీత్కరించే జనం
మేము మనసున్న
మనుషులం
బతుకు చెడ్డ విగత జీవులం
మేమేమి చేసాము పాపం
మమ్మంటూకుంటుంది నేరం


కలమనే కత్తి

నగ్న సాహిత్యం కరాళ నృత్యం  చేస్తుంటే
అర్ధనగ్న రాతలతో కామెంట్లు ఇస్తుంటే
కకావికలమైన కవిత్వం 
రెక్కలు తెగిన కోకిలలా
విల విల్లడుతుంటుంటే ...
పదాల ప్రయోగం పేరుతో
కలమనే కత్తి  చేత బట్టి 
కవిత్వాన్ని ఖూని చేసే 
విద్వంషకర రాతగాల్లు
మహా పోజుగాల్లు,
భాష ప్రయోగం పేరుతో 
వాడుకభాషను వద్దని
చందస్స భావజాలాలుతో
పెట్రేగితే
మా రాతలు మట్టి రాతలని
మట్టి కంపుకొడతాయని
చెప్పే సాహిత్యం మాది
మా రాతలు మీలా 
కల్పితాలు కావని 
జీవితాలని చెప్పే 
సాహిత్యం మాది 

బడికెల్ల(లే )ని పిల్లలు

కప్పులుకడిగే బుల్లి చేతులు
బరువులు మోసే చిట్టి మెడలు
యాచకం చేసే చిన్నారులు
బతుకీడ్చే లేత మొగ్గలు
ఎంగిలి మెతుకుల కోసం ఆరాటాలు
బతుకు పోరాటాలు
భారం మోసే బాలకార్మికులు
బడికెల్ల(లే )ని పిల్లలు
పట్టించుకోని అధికారులు
కాగితాల్లో కాకిలెక్కలు
విద్యా పక్షోత్సవాలు
అధికారుల ఆడంబరాలు
బడికి దూరమైన జీవితాలు
నగ్న సత్యాలు

మా ఆవేశం

ఎమ్మెల్యేలు ,ఎంపిల జీతాలు పెంచినట్టు
ప్రజల నిత్యావసర వస్తువులు పెంచుతారా!
జన జీవితాలతో ఆటలు ..మీకు షోకులా
ఏమి ఉద్ధరిస్తున్నారని మీకు జీతాలు
ఏమి పీకుతున్నారని మీకు హంగులు
జనాలుని దోచుకుతినడమా?
ప్రజల సొమ్మును పంచుకోవడమా
మొన్న పెట్రోలు ధర పెంచారు
నిన్న కాయగూరలు ధర పెంచారు
ఇవాళ గ్యాస్ ధర పెంచేశారు
అస్సలు ఆంధ్రాలో తీస్తున్న గ్యాస్
ఏ ముండాకొడుక్కి అమ్మేస్తున్నావు
గల్ఫ్ తరహాలో లబించే గ్యాస్ ని
ఎవడబ్బ సొమ్మని తాకట్టు పెట్టేసావు
మా నెత్తిన గుదిబండ పెడతావ?
లంచాలకు అలవాటుపడ్డ ప్రతిపక్షాలు
వెర్రివాల్లయిన ఎర్రోళ్ళు
ఎవ్వరు నోరుమెదపరు
మీ రాజ్యం ..మీ ఇస్టం
దోచుకోండి దొంగల్లరా !
ప్రస్తుతం నిద్రలో వున్నా
మా ఆవేశం ఏదో రోజున
నిద్రలేస్తుందిలే ..!!.

Monday, 20 June 2011

prathap kathimanda

శృంగార సంకెళ్ళు

జాజుల సువాసన
పక్కకు లాగితే
మనసు పక్కదారి పట్టింది
వయస్సు వురకలేసింది
యవ్వనం గుర్రమైంది
ఉత్తేజం ఉత్సాహమిచ్చింది
మదిలో పులకరింత
హృదిలో కలవరింత
నా భావాల చెంత
రుచి చూడాలనే ఉత్సుకత
విసృన్ఖాల సంకెళ్ళు తెంచింది
కోరిక పెట్రేగింది
కామం దారితప్పింది
తెరచాటున మాటలు
శృంగారం సంకెళ్ళు తెంచింది
ముక్కు మొఖం తెలీని
జాజుల పరిచయం
విషాదం మిగిల్చింది
చెప్పుకోలేని వ్యాధి
చెప్పలేని వ్యధ
ఎయిడ్స్ మృత్యు శఖటం
నా ఆనందం లో విషాదం
-కత్తిమండ ప్రతాప్


Sunday, 5 June 2011


నీ ప్రేమ కోసం


ప్రియా!

నువ్వు నాతో నడుస్తున్నప్పుడు

నీ అడుగులో అడుగునవ్వాలనుకున్న

నువ్వు నాతో మాటలాడుతున్నప్పుడు

నీ పదాల సవ్వడిలో దాక్కోవలనుకున్న

నువ్వు నాతో ఉన్నప్పుడు

నువ్వే నేను నేనే నువ్వు అనుకున్న

నీ ఆశల పల్లకిలో శ్వాసగా ఉరేగాలనుకున్న

ఉరిమే మెరుపు…తరిమే కాలం

దరిచేరకుండా ఉండాలనుకున్న

రగిలే నిప్పు.. కదిలే కాలం ..మెదిలే ఆశ

నా మదిలో శ్వాస లా ఉండాలనుకున్న

గుప్పెడంత గుండెలో సముద్రమంత

ప్రేమ పంచాలనుకున్న

సముద్రంలో ప్రతి భిన్ధువు ప్రేమగా

మారాలనుకున్న

కాని సముద్రం లో కెరటాల ఉదృతి కి

నా ప్రేమ నిలవాలని కోరుకుంటున్న

జడివానలో తడిసి ముద్దవ్వాలని

నీకు ముద్దివ్వాలని

ఉవ్విరులాడుతూ

నీ ప్రేమకోసం ప్రణయాగ్ని జ్వాలలు ఎగిసిపడుతున్నాను

నీ లోని స్వచ్చమైన ప్రేమను ఆస్వాదించడానికి

నీ లోని స్వార్ధం లేని ప్రేమను అనుభవించడానికి

నిస్వార్ధం గా స్వీకరించడానికి

నీ ప్రేమలో లాలన

నీ ప్రేమలో భావన

నీ ప్రేమలో ప్రాణం

నీ ప్రేమలో త్యాగం

నీ ప్రేమలో అనురాగం

నీ ప్రేమలో మమకారం

నీ ప్రేమలో ఆప్యాయత

నీ ప్రేమలో అభిమానం

కలగలసి నీతో జీవితం పంచుకోవాలని

అందుకే ప్రియతమా!

నా గుండెలోని ప్రేమను చూడాలంటే

నా మదిలోనో భావాల్ని శ్రుసించాలంటే

నా గుండె గొంతుకలను వినాలంటే

నా లో ప్రతి అణువు నీదేనని చెప్పాలంటే

నీ ప్రేమ కోసం ..చస్తూ బ్రతుకుతాను ..

నన్ను మరువకు ..

నీ హృది నాది నా మది నీది

మరుజన్మలో నీదే ఈ అంతరాత్మ

ఈ క్షణం నీ ప్రేమ కోసం మన్నిస్తూ

మరణిస్తూ…



నిజమైన ప్రేమ సాక్షిగా …


కులం వెక్కిరిస్తే

ప్రణయం ప్రళయం అవుతుంది

మతం మతి చెదిరితే

ప్రేమ గతితప్పుతుంది

గతి లేని మతిలేని

ఈ కుల సమాజం లో

ప్రణయం పావురమవ్వాలి

ప్రళయం వర్షం లామారాలి

తరాలు మారాలి

అంతరాలు తరగాలి

స్వరాలూ కలవాలి

సుస్వరాలు పెరగాలి

ప్రేమ గెలవాలి

కాలం మారాలి

కులం చావాలి

మనసు మారాలి

మనుసులు మారాలి

ప్రేమ పెళ్లవ్వాలి.

నీ నిజమైన ప్రేమ సాక్షిగా …




Saturday, 4 June 2011

నిజాలు

నిజాలు నిన్ను భయపెడతాయి
అబ్బద్ధాలు నిన్ను ఇబ్బంది పెడతాయి
భయం కన్నా ఇబ్బందే కష్టం
భయం పోగుట్టుకుంటే పోతుంది
ఇబ్బంది నిన్ను ఇరుకున పెడుతుంది
ఏది కావాలో నువ్వే కోరుకో