నిజమైన ప్రేమ సాక్షిగా …
కులం వెక్కిరిస్తే
ప్రణయం ప్రళయం అవుతుంది
మతం మతి చెదిరితే
ప్రేమ గతితప్పుతుంది
గతి లేని మతిలేని
ఈ కుల సమాజం లో
ప్రణయం పావురమవ్వాలి
ప్రళయం వర్షం లామారాలి
తరాలు మారాలి
అంతరాలు తరగాలి
స్వరాలూ కలవాలి
సుస్వరాలు పెరగాలి
ప్రేమ గెలవాలి
కాలం మారాలి
కులం చావాలి
మనసు మారాలి
మనుసులు మారాలి
ప్రేమ పెళ్లవ్వాలి.
నీ నిజమైన ప్రేమ సాక్షిగా …
No comments:
Post a Comment