Pages

Sunday, 5 June 2011

నీ ప్రేమ కోసం


ప్రియా!

నువ్వు నాతో నడుస్తున్నప్పుడు

నీ అడుగులో అడుగునవ్వాలనుకున్న

నువ్వు నాతో మాటలాడుతున్నప్పుడు

నీ పదాల సవ్వడిలో దాక్కోవలనుకున్న

నువ్వు నాతో ఉన్నప్పుడు

నువ్వే నేను నేనే నువ్వు అనుకున్న

నీ ఆశల పల్లకిలో శ్వాసగా ఉరేగాలనుకున్న

ఉరిమే మెరుపు…తరిమే కాలం

దరిచేరకుండా ఉండాలనుకున్న

రగిలే నిప్పు.. కదిలే కాలం ..మెదిలే ఆశ

నా మదిలో శ్వాస లా ఉండాలనుకున్న

గుప్పెడంత గుండెలో సముద్రమంత

ప్రేమ పంచాలనుకున్న

సముద్రంలో ప్రతి భిన్ధువు ప్రేమగా

మారాలనుకున్న

కాని సముద్రం లో కెరటాల ఉదృతి కి

నా ప్రేమ నిలవాలని కోరుకుంటున్న

జడివానలో తడిసి ముద్దవ్వాలని

నీకు ముద్దివ్వాలని

ఉవ్విరులాడుతూ

నీ ప్రేమకోసం ప్రణయాగ్ని జ్వాలలు ఎగిసిపడుతున్నాను

నీ లోని స్వచ్చమైన ప్రేమను ఆస్వాదించడానికి

నీ లోని స్వార్ధం లేని ప్రేమను అనుభవించడానికి

నిస్వార్ధం గా స్వీకరించడానికి

నీ ప్రేమలో లాలన

నీ ప్రేమలో భావన

నీ ప్రేమలో ప్రాణం

నీ ప్రేమలో త్యాగం

నీ ప్రేమలో అనురాగం

నీ ప్రేమలో మమకారం

నీ ప్రేమలో ఆప్యాయత

నీ ప్రేమలో అభిమానం

కలగలసి నీతో జీవితం పంచుకోవాలని

అందుకే ప్రియతమా!

నా గుండెలోని ప్రేమను చూడాలంటే

నా మదిలోనో భావాల్ని శ్రుసించాలంటే

నా గుండె గొంతుకలను వినాలంటే

నా లో ప్రతి అణువు నీదేనని చెప్పాలంటే

నీ ప్రేమ కోసం ..చస్తూ బ్రతుకుతాను ..

నన్ను మరువకు ..

నీ హృది నాది నా మది నీది

మరుజన్మలో నీదే ఈ అంతరాత్మ

ఈ క్షణం నీ ప్రేమ కోసం మన్నిస్తూ

మరణిస్తూ…



No comments: