Pages

Saturday, 25 June 2011

బడికెల్ల(లే )ని పిల్లలు

కప్పులుకడిగే బుల్లి చేతులు
బరువులు మోసే చిట్టి మెడలు
యాచకం చేసే చిన్నారులు
బతుకీడ్చే లేత మొగ్గలు
ఎంగిలి మెతుకుల కోసం ఆరాటాలు
బతుకు పోరాటాలు
భారం మోసే బాలకార్మికులు
బడికెల్ల(లే )ని పిల్లలు
పట్టించుకోని అధికారులు
కాగితాల్లో కాకిలెక్కలు
విద్యా పక్షోత్సవాలు
అధికారుల ఆడంబరాలు
బడికి దూరమైన జీవితాలు
నగ్న సత్యాలు

No comments: