కల్మషం తెలీక ఎదురీదుతున్నావా?
నిష్కల్మషంగా ఉండాలనుకుంటున్నావా?
జాతి వైరుడ్యంలో,
కుల సామ్రాజ్యంలో
నీకు అవీ సాధ్యమేనా !?
నరనరాల్లో ఎక్కడో చిన్న ధారాగా..
అంటరానితనం ధమనులు, సిరల్లో
ప్రవహిస్తూనే ఉంటుంది.
ఎప్పుడోకప్పుడు గుండె చప్పుడు చేస్తుంది
భేదాభిప్రాయాలు భగ్గు మంటాయి
కులనిప్పురవ్వలు చెలరేగుతాయి
రక్తప్రసరణ జరుగుతుంది
ఈ కులజాడ్యం ఉన్నంతవరకు
నరనరాల్లో ...
వ్యవస్థను మార్చాడానికి
ప్రయత్నించకు చాలా చాల
మజిలీలు జరిగిపోయాయి
వ్యవస్థలో లోపాలు వేలెత్తి చూపకు
దానికీ కులం కావాలి తెలుసా ?!!

No comments:
Post a Comment