ఆకాశం ఎప్పుడు తెల్లగానే ఉంటుంది
అనుకున్నాను
కాని ఆకాశం లో మబ్బులు చూసాక
నా జీవితం గుర్తొచ్చింది.
బాల్యం తెల్లగా ఉంది
యవ్వనం మబ్బులా ఉంది...
కాని- తెలుపంటేనే నాకిష్టం.
ఆకాశం లో మబ్బులు
పోతున్నాయి
వస్తున్నాయి
నా యవ్వనం లో మబ్బులు పోడంలేదు
మసక బారుతున్నాయి
మేఘం కమ్ముకుంటుంది
వర్షం వర్షిస్తుంది
మరలా ఆకాశం తెల్లగా మారిపోతుంది
నా అలవాట్లు వర్షం లో తడిచి ముద్ధవుతున్నాయి
జీవితం తడిచిపోతుంది
మేఘాలు ఆవిరవుతాయట
కాని దానివల్ల ఉపయోగం ఉంది
నా జీవితం ఆవిరవుతుంది
కన్నీటి చుక్కలా
చెడు అలవాట్లకు బానిసను నేను
మార్పు కోసం ఎదురుచూస్తున్నాను
ఆకాశం వైపు ఒంటరి చూపులు చూస్తూ
మేఘాలు గాల్లో వేల్లిపోతున్నట్టునాయి
నా చెడు స్నేహితులు కుడా ఇలా
పారిపోతే ఎంత బాగుండును
అందుకే ఆకాశం అంటే నాకెంతో ఇష్టం!
No comments:
Post a Comment