Pages

Wednesday, 10 August 2011

కోనసీమ లో క్రాప్ హాలిడే

పచ్చని పైరులతో 

అందమైన సెలయేరులతో

సరసమాడే పిల్లకాలువలుతో

వంకరల గట్టులతో

కళ కళ లాడిన కోనసీమ

నేడు విల విల బోతుంది

కల్లాల్లో ధాన్యం రైతు కళ్ళల్లో దైన్యం

అప్పుల పెట్టుబడులు

ఆకలి తీర్చని అన్నార్త నాదాలు

గిట్టుబాటులేని ధరలు

పట్టించుకోని పాలకులు

పచ్చని సీమపై పురిటి నొప్పులు

భరించలేని రైతన్న కన్నెర్ర చేసాడు

అన్నం పండించే అన్నదాత

క్రాప్ హాలిడే ప్రకటించాడు

గుండె చెదిరింది ..గూడు మిగిలింది

పంట విరామం జరిగింది

వ్యవసాయం కష్టసాయం అయ్యింది

నాడు కళ కళ లాడిన కోనసీమ

నేడు విల విల బోతుంది.



' సేవ'  తెలుగు పత్రిక
(సేవ తెలుగు దిన పత్రికలో  ఆగస్టు పదిన ప్రచురితం )




1 comment:

sivaji3999 said...

raithu ni me lanti kavi ardham chesukunattu ee rajakeyanayakulu kuda ardam chesukunte bagundunu