Pages

Wednesday, 30 November 2011

ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భం గా

విశ్రుంఖాల సంకెళ్ళు త్రెంచుకుంటూ 
శృంగార రసరమ్య అక్రమ దారుల్లో 
విశ్వం పై అడుగుపెట్టింది హెచ్ ఐ వి 
వానర పరిణామక్రమం లోనే 
నరునకు సోకిందీ సిండ్రోమ్
రక్త మార్పిడితో రక్త చరిత్ర  సృష్టిస్తుంది 
 అలైంగిక శృంగారంలో దాగుంది 
అపరిచితుడిలా వస్తోంది 
అణిగి మణిగి ఉంటుంది 
హ్యూమన్ లో పవర్ తగ్గిన వెంటనే 
వ్యాధి పవనాలు వీస్తుంది 
కాల కూట విషం తో ప్రాణాన్నే
 మింగేస్తుంధో ఎయిడ్స్ భూతం 
మాయదారి భూతం 
అక్రమ దారుల్లోనే
దోబూచులాడుతుంది
తొంగి తొంగి దాగుంది 
 వంగి  వంగి చూస్తుంది . 
మందుల్లేని ఎయిడ్స్ భూతం 
మింగేస్తుంది సాంతం 
చివరకు నువ్వు ఖతం
(వ్యభిచారం వద్దు ..సంసారమే ముద్దు ..డిసెంబర్ ఒకటి ..ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం సందర్భం గా ...చెయ్యి ..చెయ్యి కలుపుదాం!  !చైతన్య వంతులను చేద్దాం! ఎయిడ్స్ నివారణలో భాగస్వాములు అవుదాం !)


No comments: