పెట్రేగుతున్న ఆలోచనలు
మనసును అదిమి పడుతున్నాయి
ఏదో చెయ్యాలనే తపన
ఏమి చెయ్యాలో తెలీని ఆలోచనలు
కరువైన ప్రోత్సాహాలు
కన్నీటి దొంతరలు
ఆశ,నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్న
జీవన పోరాటం
ఎదురీదే ఆరాటం
లక్ష్యం, గమ్యం ఒక్కటే
నా ఆలోచనలు రెండు
గెలవటం,గెలిపించటం
ఓటమి నాకు లక్షల మైళ్ళ దూరమలో
తొంగి చూస్తుంది
3 comments:
nice
chaalaa baagundi Prathap
chaalaa baagundi Prathap...last lines are too good
Post a Comment