Pages

Sunday, 3 June 2012

గాయపడిన మనసు

జరిగే ఆకృత్యాలను చూస్తే మనసు 
గాయపడింది
ఆలోచనలు వేడెక్కాయి
అడ్డు కోవాలనే తపన
ఆదు కోవాలనే ఆలోచన
ఏమి చెయ్యలేని నిస్సహాయత
తట్టుకోలేని గుండె
ఆగని జ్వాల
ఆరని ఎద మంట
ఎందుకిలా జరుగుతుంది
ఎదురించ లేమా ?
అంతరాత్మ ప్రశ్న !?
ఏదో చెయ్యాలి
ఎలా... ఎలా ?
నిశీధి వైపు అడుగు లేసింది మనసు
నిశితం గా ఆలోచించింది
వెలుగు నీడలు కనిపించాయి
నిశీధిలో నడుచుకుంటూ వెళ్లాను
కాని...
అక్కడ కూడా ముళ్ళ బాటలే సుమా !
ఎక్కడ చూసినా పాత కధే !!!
అందుకే ఆలోచించడం మానేసాను
కాంప్ర మైజ్ ఆలోచనలు నేర్చుకున్నా




No comments: