Pages

Friday, 1 November 2013

నిజం లో నైజం

అబద్ధాన్ని బద్దలు కొడితే 
నిజం బయటకొస్తుంది 
నీ నైజం బయట పడుతుంది 
నిజం లో అబద్దం 
అబద్ధం లో నిజం
రెండు ఒకే ఇజం !
****
నీ మనస్సాక్షిని అడుగు
నిజం చెప్పమని
భయపడుతుంది
నీ అంతరాత్మను అడుగు
నిజం చెప్పమని
భయపెడుతుంది
నీ నీడను అడుగు
నిజం చెప్పమని
భయపడుతూ ... భయపెడుతుంది
****
పెదాలపై మాటలు
మనసులో నిజాలు
ఒక్కటికావు!
పెదాలుపై నిజాలు
మనసులో మాటలు
ఒక్కటే !
****
నిజం లో నువ్వు
అబద్ధం లో నేను
అద్దం లో నువ్వు
పగిలిన అద్దం లో నేను
ప్రతిబింబం లో నువ్వు
ప్రతి రూపాల్లో నేను!!!


No comments: